Monday, December 23, 2024

ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ప్రధాని నరేంద్రమోడీ కర్ణాటక పర్యటనలో భద్రత వైఫల్యం కనిపించింది. ఇ క్కడి హుబ్బళ్లిలో రోడ్‌షో సందర్భంగా ఓ యు వకుడు సెక్యూరిటీని ఉల్లంఘించి ఒక్కసారిగా ప్రధాని మోడీకి అత్యంత దగ్గరకు దూసుకురావడం కలకలం రేపింది. కార్యక్రమంలో భా గంగా ప్రధాని మోడీ ఫుట్‌బోర్డుపై నిలబడి రోడ్డుకు ఇరువైపులా జనాలకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అంతలోనే ఓ వ్యక్తి ఆయనకు పూలమాల వేసేందు కు గాను బారికేడ్ దాటి ఒక్కసారిగా రోడ్డు పై కి వచ్చాడు. అలాగే ప్రధాని మోడీ వైపు దూసుకెళ్లాడు. దీంతో అప్రమత్తమైన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అతన్ని అడ్డుకుంది. స్థానిక పోలీసులు వెంటనే అతన్ని దూరం తీసుకెళ్లారు. అనంతరం ప్రధాని యథావిధిగా రోడ్ షో కొనసాగించారు. అయితే ప్రధాని భద్రత వైఫల్యంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో పంజాబ్ లోనూ ఆందోళన కారులు రోడ్డును నిర్బంధించడంతో ప్రధాని మోడీ 20 నిమిషాల పాటు ఫ్లైఓవరపై చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News