పార్లమెంటులో భద్రతావైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడింది. బుధవారం లోక్ సభ జరుగుతున్న సమయంలో పబ్లిక్ గ్యాలరీనుంచి ఇద్దరు యువకులు అకస్మాత్తుగా సభలోకి దూకారు. నల్లచట్టాలను రద్దుచేయాలి అంటూ వారు నినాదాలు చేస్తుండగా, కొందరు ఎంపీలు వారిని పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. దీంతో సభ వాయిదాపడింది. 2001లో పార్లమెంటుపై ఇదే రోజున దాడి జరిగింది. తిరిగి అదే రోజున ఈ సంఘటన చోటు చేసుకోవడం కలవరం రేకెత్తిస్తోంది.
ఈ సంఘటనపై పార్లమెంటు సభ్యుడు కార్తీ చిదంబరం మాట్లాడుతూ “అకస్మాత్తుగా ఇద్దరు యువకులు విజిటర్స్ గ్యాలరీలోంచి సభలోకి దూకారు. వారి చేతిలో ఉన్న పొగడబ్బాలలోంచి పసుపు రంగులో పొగ వెలువడుతోంది. వారిలో ఒకడు స్పీకర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇది పార్లమెంటులో భద్రతావైఫల్యానికి నిదర్శనం” అని పేర్కొన్నారు.
#WATCH | An unidentified man jumps from the visitor's gallery of Lok Sabha after which there was a slight commotion and the House was adjourned. pic.twitter.com/Fas1LQyaO4
— ANI (@ANI) December 13, 2023