Sunday, January 19, 2025

లష్కరే నెట్‌వర్క్ ఛేదించిన భద్రతా దళాలు… ఏడుగురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

జమ్ము: జమ్ముకశ్మీర్‌లో లష్కరే తొయిబా ఉగ్రసంస్థ నెట్‌వర్క్‌ను భద్రతా దళాలు ఛేదించాయి. జమ్ము, రాజౌరీ జిల్లాల నుంచి మొత్తం ఏడుగురు కీలక సభ్యులను అదుపు లోకి తీసుకున్నాయి. దీంతో జమ్ముకశ్మీర్ లోని పలు ఉగ్రకేసులు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఏర్పడింది. దీనిపై జమ్ము డివిజనల్ డీజీ ముఖేశ్ సింగ్ మాట్లాడుతూ మొత్తం మూడు లష్కరే తోయిబా బృందాలను అదుపు లోకి తీసుకొన్నామన్నారు. వీరికి సరిహద్దు అవతల నుంచి ఆదేశాలు వస్తున్నట్టు గుర్తించి మొత్తం ఏడుగురిని అరెస్టు చేశామన్నారు. రెండు బృందాల్లోని నలుగురు ఉగ్రవాదులను రాజౌరీ జిల్లాలో అరెస్టు చేశారు. మరో బృందం లోని ముగ్గురు ఉగ్రవాదులను జమ్ములో అదుపు లోకి తీసుకొన్నారు.

భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు, పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు. రాజౌరీ జిల్లాలో తాలిబ్ హుస్సేన్ షాను భద్రతా దళాలు అదుపు లోకి తీసుకొన్నాయి. ఇతడు లష్కరే జిల్లా కమాండర్. గత మూడేళ్లుగా పీర్ పంజాబ్ ప్రాంతంలో అనేక ప్రధాన ఉగ్రకార్యకలాపాల్లో ఇతడి పాత్ర ఉంది. ఇతడి వద్ద ఏకే 47 రైఫిల్, మ్యాగజైన్లు, తూటాలు, రెండు పిస్తోళ్లు, ఐదు పిస్తోల్ మ్గాగ్జైన్లు, ఒక గ్లోక్ పిస్తోల్, 49 చైనీస్ పిస్తోల్ రౌండ్లు, వివిధ సైజుల్లో తొమ్మిది కిలోల ఐఈడీ, ఐదు రిమోట్లు, నాలుగు ఫ్రైజర్ మైన్లు స్వాధీనం చేసుకొన్నారు.

Security Forces busted Lashkar-e-Taiba Network

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News