- Advertisement -
చత్తీస్‌గఢ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల 70 అడుగుల స్మారక స్థూపాన్ని భద్రతా బలగాలు శుక్రవారం నేలమట్టం చేశాయి. జిల్లాలోని పూజారి కాంకేరు బేస్ క్యాంప్ నుంచి నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ కోసం వెళ్లిన బలగాలు సమీప తాబేలు బట్టి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు గతంలో ఏర్పాటు చేసిన 70 అడుగుల స్మారక స్థూపాన్ని నేలమట్టం చేశాయి. అక్కడ అడవుల్లో భద్రత బలగాలు మావోయిస్టుల వేటను కొనసాగిస్తున్నాయి. ఉసురు పోలీస్ స్టేషన్ పరిధిలోని మావోయిస్టు బెటాలియన్ కీలక ప్రాంతమైన పూజారు కాంకేర్‌లో ఇటీవల సిఆర్‌పిఎఫ్ ఆధ్వర్యంలో బేస్ క్యాంపును భద్రతా బలగాలు ఏర్పాటు చేశాయి. అనంతరం సిఆర్‌పిఎఫ్, డిఆర్‌జి, ఎస్‌టిఎఫ్, కోబ్రా బలగాలు మావోయిస్టుల కోసం ఇక్కడ అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగిస్తున్నాయి.
- Advertisement -