Thursday, December 19, 2024

భార్యను హత్య చేసిన సెక్యూరిటీ గార్డు

- Advertisement -
- Advertisement -

లక్నో: భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆమెను సెక్యూరిటీ గార్డు హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శిశుపాల్ సింగ్-దీప్‌మాలా అనే యువతి యువకుడు 2016లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు పిల్లలు ఉన్నారు. ఆమె ఒక షాపింగ్ మాల్‌లో పని చేస్తుంది. మరో వ్యక్తితో భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని పలుమార్లు ఆమెను హెచ్చరించాడు. ఓ యువకుడితో ఆమె మాట్లాడడం గమనించి ఇంట్లో వచ్చిన తరువాత భార్యతో అతడు గొడవకు దిగాడు. ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో భార్యను అతడు గొంతు నులిమి హత్య చేశాడు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పిల్లలను వారి బంధువులకు అప్పగించారు. భర్తను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News