Monday, December 23, 2024

కార్పొరేట్ ఆఫీసులో ఉద్యోగులు ఉండగా తలుపుకు తాళం వేసి..

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: అనుమతి లేకుండా ఉద్యోగులు ఎవరూ బయటకు వెళ్లరాదని ఆదేశిస్తూ ఒక కంపెనీ యాజమాన్యం తన సెక్యూరిటీ గార్డు చేత ఆఫీసు తలుపులకు తాళం వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.

రవి హోండా అనే వ్యాపారవేత్త తన ట్విటర్ ఖాతాలో ఈ వీడియో షేర్ స్తూ భారతీయ ఎడ్‌టెక్ ఫౌండర్లు ఇప్పుడు తమ ఉద్యోగులు బయటకు వెళ్లకుండా తాళం వేస్తున్నారు&ఈ దేశంలో నుంచి వెళ్లిపోండి..ఎక్కడా ఇటువంటి నీచానికి ఒడిగట్టరు..అంటూ కామెంట్ చేశారు.

తన అనుమతి లేకుండా ఉద్యోగులెవరూ బయటకు వెళ్లరాదని మేనేజర్లలో ఒకరు తనను ఆదేశించినట్లు సెక్యూరిటీ గార్డు అనడం వీడియోలో నివినిపించింది. కోడి నింజాస్ అనే ఈ కంపెనీ వెంటనే ఈ సంఘటనపై వివరణ ఇచ్చుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో పై నెటిజన్లు మండిపడుతున్నారు. యజమానుల దోపిడీ, క్షీణిస్తున్న ఉద్యోగ వాతావరణం, కార్పొరేట్ ప్రపంచంలో ఇప్పుడు కొత్త పరిణామ ం అంటూ యునిక్ ఇంప్రింట్స్ సహ వ్యవస్థాపకుడు హిమాంషు అటల్ వ్యాఖ్యానించారు.
ఉద్యోగ ప్రదేశాలలో ఉద్యోగుల స్వేచ్ఛకు, హక్కులకు భంగకరమైన ఈ సంఘటన దురదృష్టకరమైనదని మరో నెటిజన్ కామెంట్ చేశారు.

కాగా..ఈ సంఘటనపై కోడింగ్ నింజాస్ యాజమాన్యం స్పందించింది. ఒక దుఓ్యగి తీసుకున్న దురదృష్టకర చర్య వల్ల తమ కార్యాలయంలో ఈ సంఘటన జరిగిందని తెలిపింది. పిమిఆల వ్యవధిలోనే దీన్ని సరిచేయడం జరిగిందని, ఆ ఉద్యోగి తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం వ్యక్తం చేశారని తెలిపింది. జరిగిన అసౌకర్యానికి క్షమాపణ కూడా ఆ ఉద్యోగి చెప్పినట్లు యాజమాన్యం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News