Thursday, January 23, 2025

మార్కెట్ కమిటీల సెక్యూరిటీ గార్డులను రెగ్యులర్ చేయాలి

- Advertisement -
- Advertisement -

All India OBC Job Unions Meeting in Delhi on 22nd

మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణలో 154 వ్యవసాయ మార్కెట్ కమిటీలలో 27 సంవత్సరాలుగా తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న 1016 మంది సెక్యూరిటీ గార్డులను రెగ్యులరైజ్ చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అద్యక్షులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం బిసిభవన్ లో వివిధ జిల్లాలకు చెందినా వ్యవసాయ మార్కెట్ కమిటి సెక్యురిటీ గార్డుల సంఘం సమావేశం బిసి ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షులు గుజ్జ కృష్ణయాదవ్ అధ్యక్షత జరిగింది. ఈ సమావేశంలో ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న11 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తున్నట్లు సిఎం కెసిఆర్ ప్రకటించారు.

ఇదే తరహాలో మార్కెట్ కమిటీల సెక్యూరిటీ గార్డులను క్రమబద్దీకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గార్డులుగా పనిచేస్తున్న వారిలో ఎస్‌సి/ ఎస్‌టి/బిసి వర్గాలకు చెందిన వారు ఉన్నారు. వేరే ఉద్యోగంలోకి పోదామంటే వయోపరిమితి దాటిపోయింది. వారిని గుర్తించి మానవీయ కోణంలో పర్మనెంట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఉద్యోగులను పర్మినెంట్ చేయడంతో ప్రభుత్వానికి ఒక్క రూపాయి భారం పడదన్నారు. వీరి జీతభత్యాలను మార్కెట్ కమిటీ ఆదాయం నుంచి ఇస్తారని గుర్తుచేశారు. సమావేశంలో సెక్యూరిటీ గార్డ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాజు, బిసి మహిళా నాయకురాలు లత, బిసి విద్యార్ధి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిళ్ళ సతీష్, ప్రధానకార్యదర్శి బి.సురేష్, హైదరాబాదు జిల్లా అధ్యక్షులు ఎ. రాంబాబు, కార్యదర్శి కె. రమేష్ , గ్రేటర్ ఉపాధ్యక్షులు ఎ. యాదయ్య, ఎన్. రాజేందర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News