- Advertisement -
హైదరాబాద్: దుండిగల్ పరిధిలోని బహదూర్ పల్లెలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. బహదూర్‌పల్లిలో ఆదర్శ్ సెక్యూరిటీ సంస్థలో సెక్యూరిటీ హెడ్ గా అరవింద్ పని చేస్తున్నాడు. అదే సంస్థలో సెక్యూరిటీ గార్డ్ గా రవి విధులు నిర్వహిస్తున్నాడు. ఇద్దరి మధ్యడ్యూటీ విషయంలో వాగ్వాదం జరిగింది. అదికాస్త ముదరడంతో ఆవేశానికి లోనైన రవి కత్తితో అరవింద్ దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అరవింద్ ను తోటి సిబ్బంది కొండపల్లిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాధితుడు మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న దుండిగల్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
- Advertisement -