Tuesday, December 24, 2024

రేవంత్ రెడ్డి నివాసం వద్ద భద్రత పెంపు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నాయకునిగా ఎంపికైన రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ సీబీఐ కాలనీలోని ఆయన నివాసం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రొటోకాల్ ప్రకారం రేవంత్‌రెడ్డి వద్ద పూర్తి స్థాయి సెక్యూరిటీని కల్పించనున్నారు. హ్యాట్రిక్ సాధించాలన్న బీఆర్‌ఎస్‌ఆశలకు గండి కొడుతూ కాంగ్రెస్‌అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం విదితమే. అప్పటి నుంచి కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ప్రచారం జరుగుతూ వస్తోంది. మంగళవారం అదే నిజమైంది. కాంగ్రెస్‌అధిష్టానం రేవంత్‌ రెడ్డిని కాంగ్రెస్‌శాసనసభా పక్ష నాయకునిగా ఎంపిక చేసింది.

కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని స్పష్టపర్చింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసు ఉన్నతాధికారులు రేవంత్‌ రెడ్డి ఇంటి వద్ద భద్రతను పెంచారు. 15 మంది కానిస్టేబుళ్లను ఆయన నివాసం వద్ద మోహరించారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద మంగళవారం పెద్దగా హడావిడి కనిపించలేదు. అయితే, రేవంత్‌రెడ్డి హైదరాబాద్ చేరు కున్న తరువాత పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌నాయకులు, కార్యకర్తలు ఆయన ఇంటి వద్దకు చేరుకోవటం ఖాయమని చెబుతున్న పోలీసు ఉన్నతా ధికారులు దానిని దృష్టిలో పెట్టుకునే సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. గాంధీభవన్‌లో కూడా భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశామని వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News