Tuesday, December 17, 2024

బండికి భద్రత పెంపు

- Advertisement -
- Advertisement -

Security increased for BJP president Bandi Sanjay

హైదరాబాద్ : రాష్ట్ర బీజేపీ చీఫ్, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్‌కు పోలీసులు భద్రతను పెంచారు. ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో బండి సంజయ్‌కు 1+5 (కానిస్టేబుళ్లు)తో రోప్ పార్టీ ఏర్పాటు చేశారు. అదనంగా ఎస్కార్ట్ వాహనాన్ని పోలీసులు కేటాయించారు. హైదరాబాద్ పరిధిలో బండి సంజయ్‌కు భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్‌లో చేసిన వ్యాఖ్యలతో బండి సంజయ్‌కు ముప్పు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం పోలీసులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అగ్నిపథ్ స్కీమ్‌పై ఆందోళనలు కొనసాగుతున్న తాజా పరిస్థితుల నేపథ్యంలో బండి సంజయ్‌కు అదనపు భద్రతను ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News