Friday, December 20, 2024

జగన్, చంద్రబాబు నివాసాల వద్ద భద్రత పెంచిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు హైఎలర్ట్ ప్రకటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసాల వద్ద భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లి, మంగళగిరి వైసిపి, టిడిపి కార్యాలయాల వద్ద పోలీసుల భద్రత పెంచారు. నిఘా వర్గాల హెచ్చరికతో పోలీసులు భారీ బందోస్తును ఏర్పాటు చేశారు. కౌంటింగ్ జరగనుండటంతో మంగళవారం కౌంటింగ్ జరగనుండటంతో భావోద్వేగాలతో దాడులు జరిగే అవకాశముందని భావించిన పోలీస్ శాఖ అప్రమత్తమయింది. కౌంటింగ్ తర్వాత ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటాయన్న సమాచారంతోనే ఈ భద్రతను పెంచినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే ఎవరైనా అల్లరి మూకలు బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News