Monday, December 23, 2024

సంజయ్ రౌత్‌పై దేశద్రోహం కేసు

- Advertisement -
- Advertisement -

ప్రధానిపై సామ్నాలో అభ్యతరకర వ్యాసం

యావత్మాల్(మహారాష్ట్ర): తమ పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో ప్రధాని నరేంద్ర మోడీపై అభ్యంతరకర వ్యాసం రాశారన్న ఆరోపణపై శివసేన(యుబిటి) ఎంపి సంజయ్ రౌత్‌పై యావత్మాల్ పోలీసులు దేశద్రోహంతోసహా ఇతర నేరాల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. యావత్మాల్ జిల్లా బిజెపి సమన్వయకర్త నితిన్ భూటడా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సామ్నా పత్రిక ఎగ్జిక్యుటివ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్న శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్‌పై యావత్మాల్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారి ఒకరు మంగళవారం తెలిపారు. డిసెంబర్ 10న ప్రధాని నరేంద్ర మోడీపై సామ్నాలో సంజయ్ రౌత్ ఒక అభ్యంతరకర వ్యాసం రాశారని భూటడా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. ఐపిసిలోని 124(ఎ), 153(ఎ), 505(2) సెక్షన్ల కింద సోమవారం సంజయ్ రౌత్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఆ అధికారి చెప్పారు. దర్యాప్తు జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News