Tuesday, January 21, 2025

సేద్రీయ సాగుకు ప్రోత్సాహం ఇవ్వాలి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వ్యవసాయ రంగంలో సేంద్రీయ సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని విశ్రాంత ఏడిఏ కె.రామచంద్రం రైతులకు విజ్ణప్తి చేశారు. ఆదివారం సేంద్రీయ సాగు పంట ఉత్పత్తులకు విలువల జోడింపు అన్న అంశంపై నాబార్డు సహకారంతో జరిగిన అవగాహన సదస్సులో రామచంద్రం మాట్లాడుతూ హరితవిప్లవం పేరుతో అప్పటి పరిస్థితులకు అనుకూలంగా వ్యవసాయంలో రసాయనాలు ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. అప్పట్లో ఉన్న వ్యవసాయ పద్ధతులు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార పదార్థాలను అందించలేక పోవడం వలన ప్రజలు ఆకలితో అలమటించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఆ విపత్కర పరిస్థితుల నుండి బయట పడడానికి వ్యవసాయంలో రసాయనాలు , అధిక దిగుబడినిచ్చే వంగడాలను ప్రవేశ పెట్టి ప్రజల ఆకలిని తీర్చగలిగారని తెలిపారు. కాని వివిధ రకాల కారణాల వలన రైతులు విచక్షణారహితంగా రసాయనాలు వాడడానికి అలవాటు పడడం వలన పెట్టుబడులు పెరిగి, పంటల సాగు గిట్టుబాటు కాకపోవడంతో పాటు విచక్షణా రహిత రసాయనాల వాడకం వలన నేల, నీరు, గాలి, వాతావరణం కలుషితమై ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆందోళన వెలిబుచ్చారు. ఈ సమస్యలన్నింటికి పరిష్కారం సేంద్రియ సాగే అని, పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సేంద్రియ రైతులు నారాయణ, మనోహరాచారి, మోహన్ రెడ్డిలతో పాటు రైతునేస్తం ఫౌండేషన్ మేనేజరు ప్రసాదరావు పాల్గొన్నారు. సేంద్రియ సాగు ఆవశ్యకత, సేంద్రియ సాగులో ఉపయోగించే వివిధ రకాల కషాయాలు, ద్రావణాల తయారీ విధానం మరియు వాటి ఉపయోగాలను మనోహరాచారి వివరించారు. కంది సాగు, కందిలో అంతర పంటల విధానం మరియు కందులకు విలువ జోడిరచి కంది పప్పుగా అమ్మి తన సేంద్రియ సాగును లాభాల బాటలో నడిపిస్త్ను నారాయణ తన అనుభవాన్ని వివరించారు. దొండ, బొప్పాయి పంటల సాగు పద్థతులను క్షేత్ర స్థాయిలో ప్రత్యక్షంగా చూపిస్తూ రైతు మోహన్ రెడ్డి వివరించారు. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడిరపునకు సంబంధించిన సమాచారాన్ని , యంత్ర పరికరాల వివరాలను రైతునేస్తం ఫౌండేషన్ మేనేజరు ప్రసాదరావు వివరించారు. అనంతరం శిక్షణకు హాజరైన రైతులకు సర్టిఫికెట్లను అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News