Thursday, January 23, 2025

సెక్స్ వర్కర్ల గుర్తింపునకు సామాజిక సంస్థల జాబితానూ పరిశీలించండి: సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

See also List of Social Organizations for Identification of Sex Workers

 

న్యూఢిల్లీ: సెక్స్‌వర్కర్లను గుర్తించడానికి జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ(నాకో) జాబితాకే పరిమితం కావొద్దని, సామాజిక సంస్థలిచ్చే జాబితాలనూ పరిశీలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సోమవారం ఈ అంశంపై జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ బిఆర్ గవాయి ధర్మాసనం విచారణ జరిపింది. సెక్స్‌వర్కర్లను గుర్తించడంలో నాకో జాబితా సమగ్రంగా లేదని, చాలామందికి ఆ జాబితాలో చోటు లభించలేదని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కాగా, విచారణ జరుగుతోంది. సామాజిక సంస్థలు తయారు చేసిన జాబితాను సంబంధిత జిల్లా అధికారులు పరిశీలించి ధ్రువీకరించాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. సెక్స్ వర్కర్లకు ఓటర్ కార్డులు, రేషన్ కార్డులు జారీ చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ధర్మాసనం ఆదేశించింది. కార్డులజారీ ప్రక్రియ పూర్తి చేసి రెండు వారాల్లోగా నివేదికలు సమర్పించాలని ఆదేశించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News