- భూపాలపల్లి ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి
భూపాలపల్లి టౌన్: భూపాలపల్లిలో జరిగిన అభివృద్ధిని చూసి రాబోయే ఎన్నికలలో ఆదరించాలని భూపాలపల్లి ఎంఎల్‌ఏ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు వేశాలపల్లిలో ఇంటింటి ప్రచారంలో భూపాలపల్లి ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య నేరుగా ప్రజలను కలుస్తూ ఓటు అభ్యర్థించారు.
వేశాలపల్లి ప్రధాన కూడలి వద్ద ఏర్పాటుచేసిన సభను ఉద్దేశించి ఎంఎల్‌ఏ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఒక కుటుంబ సభ్యుడిగా ఆహ్వానించి పూర్తి సహకారం ఉద్దేశించి అందిస్తామంటున్న తరుణం చాలా సంతోషంగా ఉందన్నారు. 2009కు ముందు అభివృద్ధికి దూరంగా ఉన్న భూపాలపల్లిని ఒక్కసారి గుర్తు చేసుకోవాలని, ఎంఎల్‌ఏగా గెలిచిన తర్వాత భూపాలపల్లి పరిసర గ్రామాలను కలుపుతూ మున్సిపాలిటీగా ఏర్పాటుచేసి ఎంతో అభివృద్ధి చేసుకోవడం జరిగిందన్నారు. రోడ్ల విస్తరణ, సైడ్ డ్రైన్‌ల నిర్మాణాలు చేపట్టి స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం జరిగిందని తెలిపారు.
రెండవ సారి ఎంఎల్‌ఏగా గెలిచిన ప్రకృతి సహకరించకపోయిన మొదటి రెండు ఏళ్లు కరోనాలో అభివృద్ధి నామమాత్రంగా ఉన్న గడిచిన మూడు ఏళ్లలో ప్రభుత్వ సహకారంతో వేశాలపల్లి వార్డును ప్రత్యేక దృష్టితో సెంటర్ లైటింగ్ సిస్టంతో రోడ్డును నిర్మించుకున్నామన్నారు. వేశాలపల్లిలో అత్యధికంగా ఎస్‌టి సోదరులు ఎక్కువగా ఉన్నారని, ఒక్కసారి ఆలోచించాలని, 60 ఏళ్ల పాలనలో 6 శాతంగా ఉన్న రిజర్వేషన్లను కేంద్రం సహకరించకపోయిన అసెంబ్లీలో ప్రత్యేకంగా చట్టం తెచ్చి 10 శాతం రిజర్వేషన్ కల్పించిన ప్రభుత్వం బిఆర్‌ఎస్ అని గుర్తు పెట్టుకోవాలన్నారు.
వేశాలపల్లి ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా రెండు పడకల ఇళ్లను నిర్మించుకున్నామన్నారు. రూ.10వేలు ఉన్న రైతుబంధును రూ.16వేలకు పెంచుతుందని, కెసిఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా పథకం క్రింద ఎలాంటి మరణం సంభవించిన రూ.5లక్షల భీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. భీమా పథకం క్రింద రాష్ట్రంలో తెల్ల రేషన్‌కార్డు ఉన్న 93లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరుతుందన్నారు. అన్నపూర్ణ పథకం కింద తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు సన్నబియ్యం అందజేస్తున్నట్లు తెలిపారు. రూ.1200 ఉన్న గ్యాస్ ధరలను రేపు అధికారంలోకి రాగానే రూ.400కె వంటగ్యాస్ అందించడం జరుగుతుందన్నారు.
2016 ఉన్న ఆసరా పెన్షన్‌లను రూ.5016, రూ.3016 ఉన్న దివ్యాంగుల పెన్షన్‌ను రూ.6వేలు అందిస్తున్నారన్నారు. కెసిఆర్ ఆరోగ్య రక్ష పథకం ద్వారా రాష్ట్రంలో అర్హులైన కుటుంబాలకు రూ.15లక్షల వరకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తుందన్నారు. సౌభాగ్యలక్ష్మి పథకం క్రింద రాష్ట్రంలో అర్హులైన ఒంటరి మహిళలక ప్రతి నెల రూ.3వేలు అందిస్తున్నట్లు తెలిపారు.