మహబూబ్‌నగర్ బ్యూరో: తెలంగాణ రాక ముందు గ్రామాలను ఇప్పటి గ్రా మాలతో పోల్చుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా.వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడెలా ఉందో చూడాలన్నారు. 2014కు ము ందు రాష్ట్రంలో సరైన విద్యుత్ లేక రూ. 200 పెన్షతో , తాగడానికి నీరు లేక, రైతులు, యువత అన్ని వర్గాల వారు ఎన్నోఇబ్బందులు ఎదుర్కొ న్నారని , అలాంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అ ధికారంలోకి వచ్చిన తర్వాత అడగకముందే రైతు లకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగి ందని, రూ. 200 పెన్షన్ రెండు వేలకు, రూ. 500 వికలాంగుల పెన్షన్ రూ. 4వేలకు పెంచిన ఘనత తమదేనని అన్నారు.
మంగళవారం ఆయన జిల్లా మహబూబ్‌నగర్ గ్రామీణ మండలంలోని మాచన్ పల్లి గ్రామంలో సుమారు రూ. 10 కోట్ల విలువ కలిగిన వివిధ అభివృద్ధ్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. రామచంద్రపురం నుం డి కోటకద్ర మీదుగా రూ. 6 కోట్ల 90 లక్షల వ్య యంతో మాచన్‌పల్లి వరకు నిర్మించిన బీటీ రోడ్డును మంత్రి ప్రారంభించారు. రూ. కోటీ 61 లక్షల 28వేల వ్యయంతో నిర్మించిన 32 డబుల్ బెడ్ రూ ం ఇండ్లను ప్రారంభించారు.
అంతేకాక 97 లక్షల 85వేల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేయగా రూ. ఐదు లక్షల వ్యయంతో నిర్మించిన ముదిరాజ్ భవనాన్ని, రూ. 8 లక్షల వ్యయంతో నిర్మించిన బీరప్ప దేవాలయాన్ని మం త్రి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా త ప్రతి కుటుంబానికి ఏదో ఒక పథకాన్ని ఇవ్వడం జరిగిందని, గతంలో కరెంట్ అడిగితే కాల్చి చం పిన దాఖలాలు ఉన్నాయని, వైద్యం కోసం అప్పు లు చేసి ఉన్న ఆస్తులను ఖర్చు పెట్టుకున్న పరిస్థితులు ఉండేవని,
అలాంటిది రాష్ట్ర ముఖ్యమ ంత్రి కె. చంద్రశేఖర్‌రావు అడగకముదే రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నారని, రైతులకు రైతు బంధు కింద పెట్టుబడితో పాటు, చనిపోయిన రైతులకు రూ. 5 లక్షల బీమా చెల్లించడమే కాక, కుటుంబంలో వారికి రూ. 2వేల పెనన్ ఇవ్వడం జరుగుతుందన్నారు,. మాచన్‌పల్లి గ్రామంలో తెలంగాణ రాక ముందు రూ. 200 పెన్షన్ కింద 2005 మందికి నెలకు రూ. 40వేలు ఇవ్వగా ఇ ప్పుడు పెన్షన్ల రూపేణా 52 లక్షల 19 వేలు ఇ స్తున్నామని, కేవలం పెన్షన్ల కింద గ్రామంలో 6 కోట్ల 35 లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్య క్రమంలో గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, ఎంపీపీ సుధాశ్రీ, వైస్ ఎంపీపీ అనిత, రైతుబ ంధు, డైరెక్టర్ మల్లు నర్సింహారెడ్డి, జడ్పి కో ఆఫ్షన్ సభ్యులు , మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, సర్పంచ్ మల్లికార్జురెడ్డి తదితరులు ఉన్నారు.