Sunday, April 13, 2025

గ్రామ గ్రామానికి విత్తనం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రైతులందరికి నాణ్యమైన విత్తనాలను అందించడమే లక్షంగా గ్రామ గ్రామానికి నాణ్యమైన విత్తనం- అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంద ని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరా వు తెలిపారు. జూన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రె డ్డి చేతుల మీదుగా గ్రామ గ్రామానికి విత్తనం కా ర్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. గు రువారం సచివాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొ ఫెసర్ అల్దాస్ జానయ్య, వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి.గోపి తదికారులతో మంత్రి సమీక్ష స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ గ్రామ గ్రామానికి జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నాణ్యమైన విత్తనం అనే కా ర్యక్రమానికి కార్యాచరణ రూపొందిస్తున్నామని, జూన్ మొదటి వారంలో సిఎం రేవంత్ రెడ్డి చేతు ల మీదుగా జయశంకర్ వ్యవసాయ వర్సిటీ సహకారంతో సుమారు 40వేల మంది రైతులకు 2,500 నుండి 3,000 క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి వివరించా రు.

గత కొన్నేండ్లుగా వ్యవసాయ విశ్వవిద్యాల యం శాస్త్రవేత్తలు అనేక రకాల కొత్త వంగడాలను అభివృద్ధి పరిచారని, వాటిలో ప్రాముఖ్యం పొంది న విత్తనాలను రైతాంగానికి అందించడం ద్వారా రైతులు నాణ్యమైన విత్తనాలను వారి స్థాయిలోనే ఉత్పత్తి చేసుకొనే విధంగా ప్రోత్సహించవచ్చునని తెలిపారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉత్పత్తి చేసి, అన్ని రకాల నాణ్యతా పరీక్షలు నిర్వహించిన విత్తనాన్ని, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12వేల గ్రామాలలోని ప్రతి గ్రామం నుంచి మూడు నుంచి ఐదుగురు ఆసక్తి కలిగిన అభ్యుదయ రైతులకు జూన్ మొదటి వారంలో ఈ పథక కింద పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ పథకంలో సుమారు మూడు వేల క్వింటాళ్ళ వరకు వరి, కంది, పెసర, మినుము, జొన్న వంటి ఐదు ప్రధాన పంటల విత్తనాన్ని దాదాపు నలబై వేల మంది రైతులకు అందజేస్తామని మంత్రి తుమ్మల వెల్లడించారు. ఈ పథకం ద్వారా నాణ్యమైన విత్తనం పొందిన రైతులు తిరిగి ఆయా పంటలలో పండిన విత్తన పంటను ఆయా గ్రామాలలో తమతోటి రైతాంగానికి తక్కువ ధరకు అందజేయటం ద్వారా వచ్చే మూడేండ్లలో

గ్రామంలోని రైతులందరికి నాణ్యమైన విత్తనం అందుబాటులో ఉంటుందని తెలిపారు. రైతాంగం నకిలీ విత్తనాల మోసాల బారినుంచి రక్షించబడడమే కాకుండా నాణ్యమైన విత్తనం ద్వారా దిగుబడి అదనంగా పెరిగే అవకాశాలున్నాయన్నారు. దీంతో పాటు రైతు నికరాదాయం కూడా పెరుగుతుందని మంత్రి తుమ్మల వివరించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి.గోపి, వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, విత్తన డైరెక్టర్ డాక్టర్ నగేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News