Sunday, January 19, 2025

మహోజ్వల ఘట్టానికి బీజం వేసిన రోజు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :  తెలంగాణ జాతిని ఏకీకృతం చేసిన రోజున వంబర్ 29 అని భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటి రామారావు పేర్కొన్నారు. సమున్నతమైన ఉద్యమ ఘట్టానికి ఆ రోజున బీజం పడిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ జాతి విముక్తి కో సం చావునోట్లో తలపెట్టిన నేత కెసిఆర్ అని చెప్పారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం బిఆర్‌ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. ఆత్మగౌరవ విశ్వరూపం చూపించి.. పట్టుదలతో తెలంగాణ సాధించారన్నారు. కెసిఆర్ దీక్షతో కేంద్రం దిగి వచ్చి తెలంగాణపై ప్రకటన చేసిందని.. ఈ నేపథ్యంలో 14 ఏళ్లుగా ఏటా నవంబర్ 29న దీక్షా దివస్‌ను నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహిస్తామని కెటిఆర్ వెల్లడించారు. దీక్షా దివస్‌లో తెలంగాణ ఉద్యమకారులు, బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఆ రోజున ఎవరికి తోచిన విధంగా వారు ఆస్పత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కో రారు. ఇళ్ల మీద తెలంగాణ జెండా ఎగరవేయాలని, అమరవీరులకు నివాళులు అర్పించాలని పిలుపునిచ్చారు. చరిత్రను మ లుపు తిప్పిన రోజు నవంబర్ 29 అని కెటిఆర్ పేర్కొన్నారు. కెసిఆర్ సత్యాగ్రహం ప్రారంభం అయిన రోజు అని, ఆయన ఆమరణ దీక్ష సబ్బండ వర్గాలను కదిలించిందని, దెబ్బకు కేంద్రం దిగివచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన చేసిందని వ్యాఖ్యానించారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా తెలంగాణ కోసం పోరాటం చేశామని చెప్పారు. కెసిఆర్.. ఢిల్లీ మెడలు వంచి కెసిఆర్ తెలంగాణ సాధించారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తెలంగాణ జాతి మీద చేసిన దాష్టీకాలను ప్రజలకు గుర్తు చెయ్యాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం 1952 నుంచి వందలాది తెలంగాణ బిడ్డల బలిదానాలకు కారణమైన కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు.

స్వీయపాలనే తెలంగాణకు శ్రీరామరక్ష
సిఎం కెసిఆర్ పోరాటంతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైందని కెటిఆర్ పేర్కొన్నారు. స్వీయపాలనే తెలంగాణకు శ్రీరామరక్ష అని వ్యాఖ్యానించారు. రైతు బంధు పథకం కెసిఆర్ పేటెంట్ అని చెప్పారు. రైతు బంధు కొత్త స్కీం కాదని.. కొనసాగుతున్న పథకమని స్పష్టం చేశారు. ఇప్పటికే కొనసాగుతున్న పథకాలకు ఎన్నికల కోడ్ వర్తించదని అన్నారు.

పిఎం కిసాన్ వేస్తే రేవంత్ గొంతు ఎందుకు పెగలలేదు
రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ వేస్తే రేవంత్ రెడ్డికి కనిపించదని, ఆ రోజు ఆయన గొంతు ఎందుకు పెగలలేదని కెటిఆర్ ప్రశ్నించారు. ప్రధాని మోదీని ప్రశ్నించే దమ్ము రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు. రైతుల ఖాతాల్లో రైతుబంధు పైసలు వేస్తే రేవంత్ రెడ్డి ఎందుకు ఆగమవుతున్నాడని ప్రశ్నించారు. రైతుల పట్ల కాంగ్రెస్‌కు చిత్త శుద్ధిలేదని విమర్శించారు. పిఎం కిసాన్ నిధులు ఇస్తే తప్పు లేదు..కానీ రైతుబంధు ఇస్తే తప్పా అని నిలదీశారు. బిజెపికి రాష్ట్రంలో ఒక్క సీటు కూడా రాదని కెటిఆర్ స్పష్టం చేశారు. ఈసారి గోషామహల్‌లో ఆ పార్టీ అభ్యర్థిని ఓడిస్తామని చెప్పారు. రేవంత్‌కు బిజెపితో లోపాయికారీ ఒప్పందం ఉందని, అందుకే గోషామహల్, కరీంనగర్, కోరుట్లలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను పెట్టిందని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగాగానే బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రాజాసింగ్‌లను గెలిపించడానికి ఆ మూడు స్థానాల్లో డమ్మీ అభ్యర్థులను పెట్టారని చెప్పారు. ఈ ఎన్నికల్లో రాజాసింగ్, ధర్మపురి అరవింద్, బండి సంజయ్‌లను ఓడించి తీరుతామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు. ఐటీ దాడులు కేవలం కాంగ్రెస్ నేతలపైనే జరుగుతున్నాయనడం అవాస్తమవని, బిఆర్‌ఎస్ నాయకులపై కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయని చెప్పారు.

కర్ణాటకలో ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చారా?
తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగ నియామకాలు చేసిన రాష్ట్రం దేశంలో ఏదైనా ఉందా..? ఉంటే చూపాలని రాహుల్‌కు కెటిఆర్ సవాల్ చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మొదటి కేబినెట్‌లోనే రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పారని, ఆరు నెలలైనా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ అయినా ఇచ్చారా..? అని ప్రశ్నించారు. తొమ్మిదన్నరేళ్లలో తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రం దేశంలోనే లేదని అన్నారు. 2004 నుంచి -2014 వరకు పాలించిన కాంగ్రెస్ పార్టీ కేవలం 10 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని తెలిపారు.

నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీ పెద్ద ఆస్తి
నరేంద్రమోడీకి రాహుల్ గాంధీ పెద్ద అస్సెట్ అని కెటిఆర్ వ్యాఖ్యాయించారు. అందుకే రాహుల్ గాంధీనే ప్రతిపక్ష నేతగా ఉండాలని మోడీ కోరుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో బిజెపిని నిలువరించే శక్తి కేవలం బిఆర్‌ఎస్‌కు మాత్రమే ఉందని తెలిపారు. ఢిల్లీలో కేజ్రీవాల్, బెంగాల్‌లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్ బిజెపిని నిలువరించగలుగుతున్నారని పేర్కొన్నారు. కర్నాటకలో ఉన్నది అట్టర్ ప్లాప్ గవర్నమెంట్ అని, వారు ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తే ప్రజలు నమ్మరని కెటిఆర్ అన్నారు. కాలం చెల్లిన కాంగ్రెస్ ఎంత చెప్పినా లాభం లేదని విమర్శించారు. కర్నాటక కాంగ్రెస్ నాయకులను తెలంగాణ ప్రజలు పట్టించుకోరని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే అస్త్రసన్యాసం చేశారని వ్యాఖ్యానించారు. తమ పార్టీ అభ్యర్థలపై కూడా ఐటి దాడులు జరుగుతున్నాయని చెప్పారు. తనకు వచ్చిన ఈసీ నోటీసుకు సమాధానం చెబుతానని పేర్కొన్నారు.

నేనూ పరీక్షలు రాశా.. ఇంటర్వ్యూలకూ హాజరయ్యా
రాహుల్ గాంధీ 2014 నుంచి నిరుద్యోగిగా ఉన్నారని కెటిఆర్ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ ఉద్యోగం చేసిన వ్యక్తి కాదని, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నదీ లేదని పేర్కొన్నారు. రాజకీయ నిరుద్యోగుల మాటలు విని నిరుద్యోగులు ఆగం కావద్దని కోరారు. రాహుల్ ఒక్క ఉద్యోగ పరీక్ష అయినా రాశారా..? రేవంత్ ఏనాడైనా ఉద్యోగం చేశారా..? వీరు నిరుద్యోగుల గురించి మాట్లాడేదంటూ కెటిఆర్ ఫైర్ అయ్యారు. తాను జెఎన్‌యు నిర్వహించి అఖిల భారత స్థాయి పరీక్ష రాసి ఎంఎస్‌సి బయోటెక్నాలజీ చేశారని, అలాగే జీమ్యాట్, టోఫెల్ రాసి ఇంటర్వూలకు హాజరై అమెరికాలో ఉద్యోగం కూడా చేశానని తెలిపారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఉద్యోగం చేసిన వ్యక్తి కాదని.. ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన వ్యక్తి కాదని ఆరోపించారు. రాహుల్ పుట్టడమే గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన రాహుల్‌గాంధీకి, గోడలకు సున్నాలు వేసే స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగిన రేవంత్‌రెడ్డికి నిరుద్యోగుల బాధలు వాళ్లకు ఎలా తెలుస్తాయని విమర్శించారు. డిసెంబర్ 4న అశోక్‌నగర్‌కు అధికారులతో కలిసి వెళ్లి ఉద్యోగార్థులతో కూర్చొని జాబ్ క్యాలండర్ ప్రిపేర్ చేస్తానని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News