Wednesday, January 22, 2025

పచ్చబడ్డ తెలంగాణను చూసి కాంగ్రెస్‌కు కళ్లలో మంట

- Advertisement -
- Advertisement -

మరిపెడ : తెలంగాణలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, పంట సాగుకు పుష్కలంగా సాగునీరు, పెట్టుబడికి ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు అందించడంతో పచ్చబడ్డ తెలంగాణను చూసి కాంగ్రెస్‌కు కండ్ల మండుతున్నాయని ఎంపిపి గుగులోతు అరుణ రాంబాబునాయక్ అన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్, జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ గుడిపుడి నవీన్‌రావు ఆదేశాల మేరకు గురువారం మండలంలోని లచ్చతండా విద్యుత్ సబ్‌స్టేషన్ ముందు కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరశిస్తూ మాజీ ఎంపిపి గుగులోతు వెంకన్న, బిఆర్‌ఎస్ శ్రేణులులతో కలిసి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు. మిషన్ కాకతీయ ద్వారా ద్వారా చెరువుల్లో పూడికతీత పనులు చేసి రైతులను సిఎం కెసిఆర్ ఆదుకున్నారని చెప్పారు. రైతుబంధు, రైతు భీమాతో పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందజేసిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అవసరం లేదని రేవంత్‌రెడ్డి చెప్పడం రైతులను అవమానించడమే అన్నారు. రైతులకు వెంటనే రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎల్లంపేట, ఉల్లెపల్లి, గిరిపురం విద్యుత్ సబ్‌స్టేషన్ల ముందు బిఆర్‌ఎస్ శ్రేణులు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు తాళ్లపెల్లి శ్రీనివాస్, సర్పంచ్‌లు చిర్రబోయిన ప్రభాకర్, లూనావత్ వీరమల్లు, పెద్దబోయిన జనార్ధన్, భూక్య మల్సూర్, గుగులోతు లక్ష్మిలక్‌పతి, బానోతు బిక్కునాయక్, దారా ఆనంద్, నాయకులు పివిఎన్ శాస్త్రీ, ఉప సర్పంచ్ సుమలత సురేష్, డైరెక్టర్ గుగులోతు బాలకిషన్, గడ్డం శ్రీను, కొప్పెర శ్రీను, సూరయ్య, పట్ల మల్లయ్య, సమ్మయ్య, ఆయా గ్రామాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News