Wednesday, January 22, 2025

ఉచిత కరెంట్‌తో రైతులను ఆదుకున్న సీయం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

వైరా : 24 గంటల ఉచిత కరెంట్‌తో రైతులను ఆదుకున్న ఘనత సీయం కెసిఆర్‌కే దక్కుతుందని వైరా మున్సిపల్ వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీతారాములు అన్నారు. బుధవారం వైరాలోని కరెంట్ సబ్‌స్టేషన్ ముందు బీఆర్‌ఎస్ శ్రేణులు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు రైతులకు మూడు గంటల కరెంట్ మాత్రమే సరిపోతుందని రైతుల పట్ల నిర్లక్షంగా మాట్లాడటం సరికాదని అన్నారు. సీయం కెసిఆర్ 24 గంటలు ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తుంటే కావాలనే కరెంట్ రైతులకు అవసరం లేదు అనే విధంగా మాట్లాడటం రేవంత్ రెడ్డికి సరికాదని అన్నారు.

గత తోమ్మిది సంవత్సరాలుగా పంట పోలాలకు నిరంతరంగా కరెంట్‌ను అందిస్తున్న సీయం కెసిఆర్‌కు రైతులందరూ అండగా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏయంసి చైర్మన్ రత్నం,జిల్లా దిశా కమిటి సభ్యులు కట్టా కృష్ణార్జునరావు,వాణిజ్య విభాగం వైరా నియోజకవర్గ అధ్యక్షులు డాక్టర్ పెరుమాళ్ళ కృష్ణమూర్తి,జడ్పీ కో ఆప్పన్ మెంబర్ లాల్ ఆహ్మద్,జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ,పట్టణ అద్యక్షుడు మద్దెల రవి,రూరల్ అధ్యక్షుడు బాణాల వెంకటేశ్వరరావు,సోషల్ మీడియా కన్వీనర్ మోటపోతుల సురేష్,కౌన్సిలర్‌లు డాక్టర్ కోటయ్య,వనమా విశ్వేశ్వరరావు,జిల్లా నాయకులు మచ్చా వెంకటేశ్వరావు,సూర్యదేవర శ్రీధర్,శివ,మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News