Monday, December 23, 2024

మోడీ , షాలకు హైదర్ రాఖీలు

- Advertisement -
- Advertisement -

నోయిడా : ప్రేమ పెళ్లితో భారతదేశానికి తరలివచ్చిన పాకిస్థానీ జాతీయురాలు సీమా హైదర్ ముందస్తు రాఖీలను పంపించారు. తాను ప్రధాని మోడీకి, హోం మంత్రి అమిత్ షా, ఆర్‌ఎస్‌ఎస్ నేత మోహన్ భగవత్‌కు ఆత్మీయతతో రాఖీలు పంపించినట్లు హైదర్ మంగళవారం తెలిపారు. ఈ నెల 30న రక్షాబంధన్ పర్వదినం ఉంది. తన రాఖీబంధన్‌ను సోదరులంతా ఆదరించాలని ఈ పాకిస్థాన్ సోదరి వేడుకుంది.

పబ్జీ గేమ్స్ ద్వారా గ్రేటర్ నోయిడా నివాసి సచిన్ మీనాతో స్నేహం పెంచుకున్న హైదర్ ఆయనతో పెళ్లికి అక్రమంగా ఇండియాకు వచ్చింది. ఆమె పట్ల పలు వివాదాస్పద వార్తలు వెలువడ్డాయి. ఈ దశలోనే రాఖీలు పంపించిన హైదర్ తాను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యుపి సిఎం ఆదిత్యానాథ్‌కు కూడా రాఖీలు పంపిస్తానని తెలిపారు. సోదరులకు సకాలంలో రాఖీలు అందాలనే వీటిని ఇప్పుడే పంపించినట్లు హైదర్ చెప్పారు. దేశ బాధ్యతలు నిర్వర్తిస్తున్న వీరికి తాను రాఖీలు పంపించడం ఆనందంగా ఉందని పేర్కొన్న హైదర్ తమ వీడియో సందేశంలో జైశ్రీరాం, జై హిందు, హిందూస్థాన్ జిందాబాద్ అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News