Saturday, November 23, 2024

రాముడి రథాన్ని జుట్టుతో లాగుతూ.. అయోధ్యకు పయనం..

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం దేశం మొత్తం రామనామస్మరణం జపిస్తోంది. జనవరి 22న అయోధ్య రామమందిరాన్ని పున:ప్రారంభించి బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేయనున్నారు. ఈ మహోన్నతర కార్యక్రమానికి ముమ్మరంగా ఏర్పట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది తమ రామభక్తిని వివిధ మార్గాల్లో చూపిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌కు చెందిన బద్రీ అనే సాధువు రాముడిపై భక్తిని చూపిస్తూ.. తన జుట్టుతో రాముడి రథానికి లాగుతూ అయోధ్యకు బయల్దేరాడు.

మధ్యప్రదేశ్‌లోని దామోహ్ నుండి అయోధ్య రామమందిరానికి 566 కిమీ దూర ప్రయాణాన్ని జనవరి 11న ప్రారంభించారు. ప్రతిరోజూ దాదాపు 50 కిలోమీటర్లు రథాన్ని జుట్టుతో లాగుతూ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్ బరేలీకి చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడున్న పలు దేవాలయాలను సదర్శంచారు. అనంతరం బెహతా కూడలిలో ఉన్న హనుమాన్ ఆలయ సముదాయం నుండి తన ప్రయాణాన్ని కొనసాగించినున్నట్లు తెలిపారు.

అయోధ్యలో రాముడి ఆలయాన్ని నిర్మించి, రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించిన తర్వాత, తన జుట్టుతో రాముడి రథాన్ని లాగుతూ అయోధ్యకు వెళతానని తాను 1992లో ప్రతిజ్ఞ చేశినట్లు బద్రి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News