Thursday, January 23, 2025

విజువల్ వండర్

- Advertisement -
- Advertisement -

Seetarama Pre Release event

దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘సీతా రామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో యుద్ధ నేపధ్యంలో అందమైన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మృణాళిని ఠాకూర్ హీరోయిన్ పాత్రలో కనిపించగా రష్మిక మందన్న కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం టీజర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లో దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి, స్వప్న దత్, సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. టీజర్‌లో ప్రతి ఫ్రేమ్ లావిష్‌గా ఉంది. సినిమా విజువల్ వండర్‌గా ఉండబోతుందని టీజర్ చూస్తే అర్ధమవుతుంది.

ఈ ఈవెంట్‌లో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ “ టీజర్‌కి వండర్‌ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఇంతకంటే వండర్‌ఫుల్‌గా సినిమా ఉండబోతుంది. ’సీతా రామం’ మెమరబుల్ మూవీ. అద్భుతమైన లోకేషన్స్‌లో షూట్ చేశాం”అని అన్నారు. దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ “ప్రేక్షకులకి వండర్‌ఫుల్ ఎక్సపీరియన్స్ ఇవ్వడానికి వందల మంది రెండేళ్ళుగా కష్టపడ్డాం. దుల్కర్ సల్మాన్‌ని లెఫ్టెనెంట్ రామ్ పాత్రలో ప్రేక్షకులు ఇష్టపడతారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది”అని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News