Wednesday, January 22, 2025

సావిత్రి బాయి స్పూర్తితో ప్రతి మహిళ విద్యావంతురాలు కావాలి : సీతక్క

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : సావిత్రి బాయి స్పూర్తితో ప్రతి మహిళ విద్యావంతురాలు కావాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతక్క పిలుపునిచ్చారు. సావిత్రి బాయి పూలే జయంతి ఉత్సవ కమిటీ, బిసి సంక్షేమ సంఘం సంయుక్తాధ్వర్యంలో బుధవారం రవింద్ర భారతిలో జరిగిన సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వివిధ రంగాలలో విశేష కృషి చేసిన వారిని మంత్రి సత్కరించారు. అనంతరం మంత్రి సావిత్రి బాయి ఫూలే సేవలను గుర్తుచేసుకున్నారు. మహిళ చదువుకుంటేనే ఇంటికి శోభ అని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా సావిత్రి బాయి పూలే తను అనుకున్న లక్ష్యాన్ని చేధించిందని అన్నారు. నేను విప్లవోద్యమంలో అధ్యయనం, పోరాటం జోడించి పనిచేశానని, ఫూలే స్ఫూర్తితోనే డాక్టరేట్ సాధించానని మంత్రి చెప్పారు. నేను బతికి ఉన్నన్నాళ్లు ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యమని అన్నారు. విద్య అంతుబట్టని సంపద అని, విద్యను ఎవరూ దోచుకోలేరని మంత్రి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News