Tuesday, November 19, 2024

దళితులకు మూడెకరాలకు బదులు రూ.15 లక్షలు ఇవ్వాలి

- Advertisement -
- Advertisement -

దళితులకు మూడెకరాలకు బదులు రూ.15 లక్షలు ఇవ్వాలి
నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు: అసెంబ్లీలో సీతక్క

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో దళితులకు మూడెకరాల భూమి కలగానే మిగిలిందని, భూమి ఇవ్వలేని పరిస్థితుల్లో దానికి బదులు ఎకరానికి రూ.5 లక్షల చొప్పున రూ.15 లక్షలు ఇవ్వాలని కాంగ్రెస్ ఎంఎల్‌ఎ సీతక్క కోరారు. భూమి ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. అసెంబ్లీలో మంగళవారం సీతక్క మాట్లాడారు. బిసి జనాభా 50 శాతం ఉంటే బడ్జెట్‌లో బిసిలకు 2.39 శాతం మాత్రమే నిధులు కేటాయించారని, బడ్జెట్‌లో బిసిలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. బిసిలకు హాస్టళ్లను పెంచాలని చెప్పారు. బడ్జెట్‌లో నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించకపోవడం బాధాకరమని అన్నారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని, అందుకోసం గ్యారంటీ లేకుండా బ్యాంకు రుణాలు ఇవ్వాలని సూచించారు.

అద్దె భవనాలలో ఉన్న ఎస్‌సి హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని కోరారు. ఎస్‌సిల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచేలా కృషి చేయాలని పేర్కొన్నారు. ఎస్‌సి,ఎస్‌టి ఉద్యోగులకు పదోన్నతుల సమస్యలను పరిష్కరించాలని అన్నారు. గత మూడు సంవత్సరాలు రాష్ట్రంలో రేషన్‌కార్డులు ఇవ్వడం లేదని, అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. గిరిజనులకు కోసం రూపొందించిన చట్టాలను గౌరవించి గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని అన్నారు. అడవుల్లో చేపలు పట్టుకోవడానికి, ఇతర పనులకు గిరిజనులను అటవీ అధికారులు అనుమతించడం లేదని, గిరిజనుల అటవీ అధికారుల ఇబ్బందులు తొలగించాలని కోరారు. ములుగులో గిరిజన యూనివర్సిటీ సాధించేలా కృషి చేయాలని కోరారు. ధరలపై ప్రభుత్వానికి నియంత్రణ ఉండాలని పేర్కొన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి పేదలకు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని కోరారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిఆర్‌టిలను రెగ్యులరైజ్ చేయాలని తెలిపారు. రాష్ట్రంలో నడిరోడ్డుపై హత్యలు జరుగుతున్నాయని, శాంతిభద్రతలు మరింత పటిష్టంగా అమలు చేయాలని అన్నారు.

Seethakka Addressed at Telangana Assembly

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News