- Advertisement -
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మంత్రి సీతక్కను ఆదిలాబాద్ జిల్లాకు ఇంఛార్జ్‌గా నియమించారు. దీంతో మంత్రి సీతక్క రివ్యూ మీటింగ్ వెళ్తుండగా చెన్నూరు ఎంఎల్‌ఎ వివేక్ వెంకటస్వామి తన ఇంటికి ఆమెను ఆహ్వానించారు. సీతక్కకు స్థానిక నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వివేక్ ఇంట్లో ఆమె బ్రేక్ స్ట్ చేసిన అనంతరం నిజయోజకవర్గం అభివృద్ధి పనులపై స్థానిక నేతలతో చర్చించారు. చెన్నూరు అభివృద్ధికి అన్ని విధాలు సహకరిస్తానని ఆమె స్పష్టం చేశారు.
- Advertisement -