హైదరాబాద్: తాను నమ్మిన సిద్ధాంతం ప్రకారమే నడుచుకుంటానని, కాంగ్రెస్ పార్టీ అదేశానుసారం మాత్రం ఓటు వేశానని ఎంఎల్ఎ సీతక్క తెలిపారు. క్రాస్ ఓటింగ్ చేసే అలవాటు నాకు లేదన్నారు. ఓటు వేసే క్రమంలో బ్యాలెట్ పేపర్లో పేర్లు ఉన్న చోట కాకుండా మరో చోట ఇంకు పడిందన్నారు. దీంతో సీతక్క కొత్త బ్యాలెట్ పేపర్ ఇవ్వాలని అధికారులను అడిగారు. వారు ఇవ్వకపోవడంతో అదే బ్యాలెట్ ను పోలింగ్ బాక్స్ లో వేయాల్సి వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థికే తాను ఓటు వేశానని వెల్లడించారు. తాను నమ్మిన సిద్ధాంతాలను ప్రాణం పోయిన కూడా వదలిపెట్టనని సీతక్క స్పష్టం చేశారు. తాను బిజెపి అభ్యర్థికి ఓటు వేయలేదన్నారు. తనపై తప్పుడు ప్రచారాలు చేయవద్దని కోరారు.
- Advertisement -