Tuesday, February 25, 2025

బిజెపి వద్ద అభివృద్ధి లేదు, సబ్జెక్టు అంత కన్నాలేదు: సీతక్క

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిరుద్యోగులు, యువకులకు జవాబు చెప్పుకోక …మత రాజకీయాలకు కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ పాల్పడుతున్నారని  మంత్రి సీతక్క విమర్శలు గుప్పించారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీతక్క మీడియాతో మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి… జిల్లాకు 200 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. చెప్పుకోవడానికి అభివృద్ధి లేదని, సబ్జెక్టు అంత కన్నా లేదన్నారు. నోరు తెరిస్తే హిందూస్థాన్, పాకిస్థాన్…హిందూ, ముస్లిం తప్ప మరో మాట తెలియదని విరుచుకు పడ్డారు. ఎన్నికలప్పుడే హిందూ,ముస్లిం అని రెచ్చగొడతారని సీతక్క స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News