Monday, December 23, 2024

పదవులు వద్దు .. పార్టీ కోసం కష్ట పడుతాం: సీతక్క

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ న్యూస్: పదవీ వున్నా లేకున్నా తాము పనిచేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. పిసిసి పదవులకు రాజీనామా చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇంట్లో నుంచి బయటకు రానోళ్లు బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీని కాపాడాలని, రాహుల్ గాంధీ కూడా ఎంతో శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ఇలాంటి సంక్షోభాలు తీసుకురావడం కరెక్ట్ కాదని ఆమె హితవు పలికారు. తమ వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందనుకుంటే తామే జరగనివ్వమని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం బాగుందని రాహుల్ కూడా చెప్పారని ఆమె తెలిపారు. తాను నిఖార్సయిన కాంగ్రెస్ కార్యకర్తను కాదని అందువల్ల తాను సీనియర్ల మీద బహిరంగ విమర్శలు చేయదలచుకోవడం లేదన్నారు. మా పదవులే వాళ్లకు ఇబ్బంది అయినప్పుడు తమకు అసలు పదవులే వద్దని తేల్చిచెప్పారు. నిఖార్సయిన కాంగ్రెస్ వాదులంతా పార్టీ అధికారంలో వున్నప్పుడు పదవులు అనుభవించి పక్కకు వెళ్లిపోయారని కానీ తాము కాంగ్రెస్‌లోకి వచ్చాక పార్టీ ప్రతిపక్షంలో వుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News