Sunday, December 22, 2024

అందుకే మాకు పట్టం కట్టారు: సీతక్క

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ నాయకుల వేధింపులు తట్టుకోలేక ప్రజల కాంగ్రెస్‌కు పట్టం కట్టారని మంత్రి సీతక్క తెలిపారు. ఇంటింటికి ఉద్యోగం పేరుతో పది సంవత్సరాల నుంచి నిరుద్యోగులను బిఆర్‌ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉన్న ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదని అడిగారు. శాసన సభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీతక్క ప్రసంగించారు. కెసిఆర్ పాలనలో పొరుగు సేవల ఉద్యోగులకు నెలల పాటు జీతాలు ఇవ్వలేదని గుర్తు చేశారు. ఆశా కార్యకర్తలు, అంగన్వాడీల తల్లిదండ్రులు, చిరుద్యోగుల తల్లిదండ్రులు పెన్షన్లు బిఆర్‌ఎస్ ఎందుకు తీసేసిందని ప్రశ్నించారు. ధరణి పేరుతో పేదలకు పట్టాలు ఇవ్వకుండా బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టలేదా? అని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News