- Advertisement -
హైదరాబాద్: బిఆర్‌ఎస్‌కు ఇంకా అహంకారం తగ్గలేదని మంత్రి సీతక్క మండిపడ్డారు. ‘దళిత స్పీకర్‌పై బిఆర్‌ఎస్‌కు గౌరవం లేదు, స్పీకర్‌ను నువ్వు అంటూ సంబోధించడం సరికాదు’ అని దుయ్యబట్టారు. అసెంబ్లీ ఆవరణంలో మీడియా పాయింట్ ముందు సీతక్క మాట్లాడారు. దళిత స్పీకర్ కాబట్టే ఏకవచనంతో పిలుస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో గవర్నర్ నరసింహన్, దివంగత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉన్నప్పుడు ఆయన కాళ్లు మొక్కేవాళ్లు అని, బిఆర్‌ఎస్ నేతలకు మహిళా గవర్నర్ అంటే గౌరవంలేదని, ఆదివాసీ రాష్ట్రపతి అంటే గౌరవం లేదని విమర్శలు గుప్పించారు.
- Advertisement -