హైదరాబాద్: రైతులకు బేడీలు వేసిన చరిత్ర బిఆర్‌ఎస్‌ది అని మంత్రి సీతక్క మండిపడ్డారు. రైతులు వరి వేస్తే ఉరి అన్నారని, కౌలు రైతులపై మాట్లాడే అర్హత బిఆర్‌ఎస్‌కు లేదని మండిపడ్డారు. కౌలు రైతులకు రైతుబంధు ఎందుకు ఇవ్వాలని బిఆర్ఎస్ వాళ్లు అన్నారని దుయ్యబట్టారు. రైతు భరోసా విధి విధానాలపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీతక్క మాట్లాడారు. భూములపై సమగ్ర సర్వే జరగాలని, రూ.5 లక్షల జీతం తీసుకునే వాళ్లు కూడా రైతుబంధు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. రైతుల ముసుగులో బడాబాబులు రైతుబంధు తీసుకున్నారని, వ్యవసాయం చేసే కౌలు రైతులకు రైతుబంధు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. బిఆర్‌ఎస్ ఇచ్చింది రైతుబంధు కాదు అని పట్టా పెట్టుబడి అని మండిపడ్డారు. పట్టాలేని ఎంతో మంది రైతులకు రైతు బంధు రాలేదన్నారు. బిఆర్‌ఎస్ చేసింది రుణమాఫీ చేయలేదని వడ్డీ మాఫీ చేసిందని చురకలంటించారు. భూమి లేని పేదలకు బిఆర్‌ఎస్ ఏం చేసిందని సీతక్క ప్రశ్నించారు.
అది రైతుబంధు కాదు… పట్టా పెట్టుబడి: సీతక్క
- Advertisement -
- Advertisement -
- Advertisement -