Tuesday, December 3, 2024

నా ఫొటో సైజు, గుర్తు తగ్గించారు: సీతక్క

- Advertisement -
- Advertisement -

ములుగు: తనని ఓడించేందుకు బిఆర్‌ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని ములుగు కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క మండిపడ్డారు. ఇవిఎంలలో తన ఫోటో, గుర్తు సైజు తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కలెక్టర్ బిఆర్‌ఎస్‌కు అనుకూలంగా పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. మహిళా కలెక్టర్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని ఆమె హెచ్చరించారు. బిఆర్‌ఎస్ నేతలు డబ్బులతో ప్రలోభాలకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీ ఎన్నికల బరిలో కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క పోటో, చేతి గుర్తు చిన్నదిగా ఉందని కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. నామినేషన్ పత్రాల్లో ఇచ్చిన ఫొటో సైజ్ తగ్గించారని డిసిసి అధ్యక్షుడు అశోక్, రవళి, భాస్కర్ రావు ఆరోపణలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News