మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో గిరిజన విశ్వవిద్యాలయం పరిస్థితి దారుణంగా ఉందని కాంగ్రెస్ ఎంఎల్‌ఎ సీతక్క ఆరోపించారు. ములుగులో భూమి కేటాయించినప్పటికీ విశ్వవిద్యాలయం ఇంకా నోచుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విభజన హామీ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలకు గిరిజన విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం ఎపిలో ఇప్పటికే ప్రారంభం కాగా మన రాష్ట్రంలో దాని ప్రసక్తే లేవనెత్తలేదని ఆమె అన్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరాజన్‌ను కలిసిన సీతక్కర గిరిజన విశ్వవిద్యాలయం అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. మేడారం పర్యటనకు వచ్చిన సందర్భంలో గవర్నర్‌కు వివరించానని, మరోమారు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆమె చెప్పారు. ఎనిమిదేళ్లు గడిచినప్పటికీ విశ్వవిద్యాలయం ముందుకెళ్లకపోవడంతో గిరిజన విద్యార్థులకు అన్యాం జరుగుతుందని సీతక్కర అన్నారు. విశ్వవిద్యాలయం పూర్తయితే ఇప్పటికే పర్యాటక రంగంలో ముందున్న ములుగు ఎడ్యుకేషన్ హబ్‌గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Seethakka Meet with Governor Tamilisai