Monday, December 23, 2024

బీఆర్ఎస్ పై మంత్రి సీతక్క ఫైర్..

- Advertisement -
- Advertisement -

బీఆర్ఎస్ పార్టీపై మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు చేశారు. గత పదేళ్లు అధికారంలో ఉండి ఎస్టీలకు ఏం చేశారు? అని సీతక్క మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా సభలో మాట్లాడిన సీతక్క.. ఎస్టీలకు పోడు భూముల చట్టం ద్వారా 2006లో లబ్ధి కలిగించామని చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉన్నా ఎస్టీలకు మీరేమీ చేయలేదని విమర్శించారు.

“మీ పదేళ్ల పాలనలో ఎంతమంది ఎస్టీలకు ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి?. బీఆర్ఎస్ పాలనలో ఎస్టీలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. నా తల్లిదండ్రులకు చట్ట ప్రకారంమే పోడు భూముల హక్కు వచ్చింది. అడవిని ఆధారంగా చేసుకుని బతికే కుటుంబాలు మావి” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News