Thursday, January 23, 2025

ఆ నేతకు అగ్గిపుల్ల దొరకలేదా : సీతక్క

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కావాలా? వద్దా? అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. బస్సుల్లో మహిళలు ఉచితంగా తిరిగితే బిఆర్‌ఎస్ వాళ్లకు సమస్య ఏంటని? అడిగారు. మహిళలకు ఫ్రీ జర్నీని బిఆర్ ఎస్ తట్టుకోలేకపోతుందని విమర్శించారు.  గవర్నర్ తమిళిసై ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసన సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పల్లా రాజేశ్వర్ రెడ్డి కామెంట్స్‌కు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. భావోద్వేగాలు రెచ్చగొట్టడం బిఆర్‌ఎస్ నేతల నైజం అని మండిపడ్డారు. గతంలో బిఆర్‌ఎస్ నేత పెట్రోల్ పోసుకున్నారు కానీ అగ్గిపుల్ల దొరకలేదా? అని చురకలంటించారు. బిఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టడంతోనే అమాయకులు చనిపోయారని సీతక్క ధ్వజమెత్తారు. ఆటో డ్రైవర్లను బిఆర్ఎస్ నేతలు రెచ్చగొడుతున్నారని, ఆటోలను ముందు పెట్టి బిఆర్ఎస్ రాజకీయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూస్వాములు లక్షల రూపాయలు రైతు బంధు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఆర్ టిసి ఆస్తులను బిఆర్ఎస్ నాయకులు ధ్వంసం చేశారని సీతక్క ఆరోపణలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News