Tuesday, January 21, 2025

విద్యుత్ సంస్థలను 60 వేల కోట్ల అప్పుల్లో ముంచిన అవినీతి ఘనుడు ఎవరు?….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మసిపూసి మారేడుకాయ చేయడంలో గులాబీ దండును మించినోళ్లు ఈ దునియాలోనే లేరని కాంగ్రెస్ ఎంఎల్ఎ సీతక్క విమర్శించారు. రేవంత్ రెడ్డిపై బిఆర్ఎసోళ్లు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న సందర్భంగా సీతక్క మీడియాతో మాట్లాడారు. బిఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో రైతులను మోసం చేస్తుందని మండిపడ్డారు. 12 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదన్న విషయం ఏ సబ్ స్టేషన్ కు వెళ్లినా తెలుస్తుందన్నారు.  తొమ్మిదేళ్లలో విద్యుత్ సంస్థలను 60 వేల కోట్ల అప్పుల్లో ముంచిన అవినీతి ఘనుడు సిఎం కెసిఆర్ అని ఆరోపణలు చేశారు. ఈ మోసాలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో సబ్ స్టేషన్ల ముందు కెసిఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేయాల్సిందిగా కాంగ్రెస్ శ్రేణులకు సీతక్క పిలుపునిచ్చారు.

Also Read:  రేవంత్ వ్యాఖ్యలు బాధ కలిగించాయి: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారని, తెలంగాణలో 90శాతం రైతులు సన్న, చిన్నకారు రైతులే ఉన్నారని, వారి పొలాల్లో సాగుకి 3 గంటల కరెంట్ సరిపోతుందన్నారని, కాబట్టి రోజుకు 8 గంటల కరెంట్ ఇవ్వాలని, దాని ద్వారా కరెంటు  దుర్వినియోగం కాదని చెప్పారన్నారు. కరెంట్ తక్కువగా ఇవ్వడంతో ఇంకిపోయిన భూగర్భజలాలు తిరిగి యధావిధిగా స్థాయిలోకి వస్తాయని తెలియజేశారని, రైతుకి, భవిష్యత్ తరాల అన్ని అవసరాలకు ఉపయోగపడతాయని ఎంతో దూరదృష్టితో ఆలోచించి చెప్పారన్నారు. కానీ మిడి మిడి జ్ఞానం ఉన్న మీలాంటోళ్లకు అది అర్ధం కాక అవాకులు చవాకులు పేలుతున్నారని దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News