- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మంత్రి సీతక్కతో ఐఎఎస్ స్మితా సబర్వాల్ భేటీ అయ్యారు. సీతక్క ముందు స్మితా సబర్వాల్ కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు స్మితా వ్యవహరించిన తీరుపై కామెంట్లు చేశారు. దళిత నాయకురాలితో ఇలాగేనా ప్రవర్తించేది అంటూ హాట్ హాట్‌గా కామెంట్లు పెట్టారు. ఆమె అహంకారంతోనే అలా చేసి ఉంటారని విమర్శలు వచ్చాయి. ఇదే అంశంపై ఆమె మీడియాతో మాట్లాడారు. కాలు మీద కాలు వేసుకునే అలవాటు ఉందని చెప్పారు. తన స్టైల్ అలానే ఉంటుందని వివరణ ఇచ్చారు. పదవీ విరమణ చేసిన తరువాత రాజకీయ ప్రవేశంపై ఆలోచన చేస్తానని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఏమైనా జరుగవచ్చునని చెప్పారు.
- Advertisement -