Monday, January 20, 2025

మధుర ఫలం సీతాఫలం..!

- Advertisement -
- Advertisement -

అందుబాటులో పేదోడి యాపిల్, పుష్కలంగా పోషకాలు..మెండుగా ఔషధగుణాలు
నిరుపేదల జీవనోపాధికి తోడ్పాటు, కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న ప్రజలు

మన తెలంగాణ/పరిగి: పేదోడి యాఫిల్‌గా పేరుగాంచింది మన ఊరు మధుర ఫలం సీతాఫలం.. ఈ చెట్లు ఊరూరా కనిపిస్తాయి.. గ్రామ శివారులలో, పొలిమెరల్లో, గుట్టల్లో ,చేనుల గట్లపై విరివిగా పెరుగుతా యి..నిండుగా పూత పూసి కమ్మటి పండ్లను ఇస్తాయి.. నిరుపేద కుటుంబాల బతుకులకు జీవనాధారమైతే.. గొప్పోడికి తియ్యటి ఫలహారమవుతోంది.. ఎన్నో పోషక విలువలు, మరెన్నో ఔషద గుణాలు ఉన్న ఈ చెట్టుకు వాన నీరే ప్రాణధారం. ఈ చెట్లకు ఏలాంటి తెగులు సోకదు. ఏ పురుగు వీటి ఆకులను తినదు. ఏలాంటి పురుగు మందులు ఈ చెట్లకు అవసరం ఉండదు. ఇవి సంవత్సరాంతం ఆరోగ్యంగా ఉంటూ నిండుగా పూత పూసి కమ్మని పండ్లను కాస్తాయి. రసాయనాల జాడ లేని మధురమైనా సీతాఫలాలను అందిస్తాయి.

తనను ఆదరించిన వారి కడుపు నింపడమే జీవన గమనం అంటోంది సీతాఫలం. గతంలో ఐదారేళ్ల క్రితం వర్షాభావ పరిస్థితుల కారణంగా సీతాఫలాలు అంతగా కాయకపోవడంతో మార్కేట్లో కనిపించలేదు. అయితే వరుసగా రెండేళ్లుగా అదునులో వానలు సమృద్దిగా కురవడంతో చెట్లు విరగకాశాయి. వికారాబాద్ జిల్లాలోని పరిగి నియోజకవర్గంలో పరిగి, పూడూరు, దోమ, కులకచర్ల, చౌడాపూర్, గండ్వీడ్, మహ్మాదాబాద్ మండలాలతో పాటు వికారాబాద్, కొడంగల్, తాండూర్ నియోజకవర్గాలలోని పలు మండలాలలో సీతాఫలం అధికంగా కనిపిస్తాయి. ఇక్కడ లభించే సీతాఫలాలకు రుచితో పాటు ఔషదగుణాలు కలిగి ఉండటంతో వీటికి మంచి డిమాండ్ ఉంది. గత కొన్ని రోజులుగా సీతాఫలాలు మార్కేట్‌కు రావడం ప్రారంభమైంది.

మనషులకు ఎక్కువగా పోషకాలు అందించే సీతాఫలాలు ప్రతిఏటా సీతాకాలంలో వచ్చే లాభాలు మిగతా పండ్ల కంటే కొంత తక్కువనే అని చెప్పుకోవాలి. ధర తక్కువగా ఉండటం ఆపిల్‌లో ఉండే పోషకాలకు ధీటుగా ఇం దులో పోషకాలు ఉండడంతో ఈ సీతాఫలాన్ని పేదోడి యాపిల్ అ ం టారు. ఈ ఫ లా లు కేవలం సె ప్టె ం బర్ నుంచి న వంబర్ వరకు మా త్రమే ఎక్కువగా అందుబాటులో ఉం టా యి. ఈ ఏడాధి వ ర్షాలు సమృద్దిగా కురువడంతో సీతాఫలాల దిగుబడి కూడా బాగా ఉంది. జాతీయ, రాష్ట్ర రహాదారులలో రాకపోకలు సాగించే వందలాది వాహానాల్లో ప్రయాణించే వారు ఈ పండ్లు కొనుగోలు చేస్తుంటారు.

పోషకాలు అధికం..

పోషకాలు అధికంగా ఉండటం, సీతాఫలం పండు కూడా తియ్యగా ఉండటంతో ప్రతి ఒక్కరు ఈ పండును అమితంగా ఇష్టపడుతుంటారు. మాంసకృతులు, పీచు, ఖనిజ లవణాలు, విటమిన్‌లు, శరీరానికి శక్తి నిచ్చే కొవ్వు పుష్కలంగా ఉంటాయి. ఇందులో లభించే మెగ్నేషియం శరీరం పని తీరును మెరుగుపర్చి గుండెజబ్బుల నుంచి కాపాడుతుంది. సీజన్‌ను బట్టి వచ్చే ఈ పండ్లను ప్రతి ఒక్కరూ కచ్చితంగా తీసుకోవాలని వైద్యులు కూడా సూచిస్తుంటారు.

అందరికి అందుబాటులో..

ప్రతి గ్రామంతో పాటు పట్టణాలు ఆయా మండల కేంద్రాలలో ఈ పండ్లు అందుబాటులో ఉంటాయి. ఇతర రకాల పండ్లు త్వరగా మాగేందుకు కొన్ని రకాల రసాయనాలను వాడుతుంటారు. కానీ సీతాఫలాలకు మాత్రం ఏలాంటి రసాయనాలు లేకుండానే సహాజంగా పండుతుంటాయి. ఎక్కువగా గుట్టలుగా ఉన్న ప్రాంతాలలో ఈ పండ్ల చెట్లు ఉండటంతో వీటిని అమ్మేవారు కూడా గుట్ట ప్రాంతాల నుంచే ఈ పండ్లను తెచ్చి అమ్మకాలు కొనసాగిస్తుంటారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అటవీ ప్రాంతాలతో పాటు గ్రామాలలోని గుట్టల ప్రాంతాల నుంచి తెచ్చి ఆయా ప్రాంతాలలో బస్టాండ్ వద్ద కూరగాయల మార్కేట్ కూడళ్లలో వీటిని విక్రయిస్తుంటారు. పండ్ల సైజ్‌ను బట్టి ఒక్కో పండు ధర రూ. 10 నుంచి రూ. 20 వరకు అమ్ముతుంటారు. ఒక్కో బుట్ట దాదాపు రూ. 150 నుంచి రూ. 300 వందలు వెచ్చించి కొనుగోలు చేస్తుంటారు. మిగతా పండ్ల వ్యాపారులతో పోలిస్తే సీతాఫలాల వ్యాపారంలో కొంత ఎక్కువ లాభాలు ఉండటంతో వీటి అమ్మకాలపై కొంత ఎక్కువ దృష్టిని కేటాయిస్తుంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News