Monday, December 23, 2024

నేడు రుణమాఫీ, సీతారామ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్/ఖమ్మం/వైరా : స్వా తంత్య్ర దినో త్సవం సందర్బంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగం రుణ బంధనాలను తెంచుకుని స్వేచ్చా వాయువులు పీల్చుకునే శుభఘడి యాలు మరి కోద్ది సేపట్లోనే ఆవిష్కృతం కాబోతున్నాయి. పంటల సాగుకోసం పెట్టుబడిగా బ్యాంకుల ద్వారా రుణా లు తీసుకున్న రైతులకు పెద్ద ఎత్తున ఊరట కలుగబోతోంది. చివరి విడుత రుణమాఫీతో మొత్తం 32.50లక్షల మంది రైతులకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రుణవిముక్తిని కల్పించబోతోంది. తెలంగా ణలోని లక్షలాది వ్యవసాయ కుంటుబాల్లో సం బరాలు అంబరాన్నంటబోతున్నాయి. అందు కు త గ్గట్టుగానే రాష్ట్రంలో మూడో విడత రుణ మాఫీ కో సం సర్కారు సిద్ధమైంది. అదే రోజు గో దావరిన దిపై చేపట్టిన సీతారామ ఎత్తిపోతల సా గునీటి ప థకానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రా రంభోత్స వం చేయనున్నారు. ఒకే రోజు వ్యవసా యరంగా నికి సంబంధించిన రెండు కీలక పథ కాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వేదిక కాబోతోంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే లక్ష నుంచి లక్షన్నర రూపాయలలోపు రు ణమాఫీ చేసింది.

ఈ నెల 15న మూడో విడతలో రూ.2 ల క్షల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం చేసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో మూడవ వి డత రుణమాఫీకి ప్రక్రియకు సం బంధించిన నిధు లు విడుదల చేయనున్నారు. ప్ర భుత్వం రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుం టోంది. ఆగస్టు 15 లోగా రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణ మాఫీ చేసి తీరుతామని ప్రకటిం చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంతకు నెల రోజుల ముందే ఈ పథకాన్ని అమలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 32.50 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేసేం దుకు రూ.31 వేల కోట్ల రుణమాఫీకి ప్రభుత్వం నిధులు కేటాయించి దేశంలోనే కొత్త రికార్డు నెలకొల్పింది. జులై 15వ తేదీన రుణమాఫీ జీవో జారీ చేసిన ప్రభుత్వం, మూడు రోజుల వ్యవధి లోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయటం మొదలు పెట్టింది. జులై 18వ తేదీన మొదటి విడతగా లక్ష రూపాయల స్లాబ్ వరకు రుణమున్న రైతు కుటుంబాలన్నింటికీ ఏకకాలంలో రుణమాఫీ చేసింది.

11 లక్షల 14 వేల 412 మంది రైతులకు రూ.6034.97 కోట్లు విడుదల చేసింది. జులై 30వ తేదీన అసెంబ్లీ వేదికగా రెండో విడత రుణమాఫీ కార్యక్రమం అమలు చేసింది. 1 లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు రుణం కలిగి ఉన్న రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేసింది. దాదాపు 6 లక్షల 40 వేల 823 మంది రైతుల ఖాతాల్లో రూ.6190.01 కోట్లు జమ చేసింది. కేవలం 12 రోజుల్లోనే దాదాపు 17.55 లక్షల రైతుల కుటుంబాలకు రూ.12 వేల కోట్లకుపైగా రుణమాఫీ నిధులు జమ చేయటం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మూడో విడత పంట రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది.

అమెరికా పర్యటన కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించుకుని స్వేదేశానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తొలి ప్రభుత్వ కార్యక్రమంగా వ్యవసయారంగాన్నే ఎంచుకున్నారు.స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో భాగంగా గొల్కొండ కోటపైన జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం సిఎం నేరుగా ఖమ్మం జిల్లా పర్యటను ఎంచుకున్నారు. ఇక్కడ గోదావరి నదిపై నిర్మించిన సీతారామ ఎత్తిపోతల సాగునీటి పధకానికి సంబంధించిన మూడు మోటార్లను ప్రారంభించనున్నారు. అనతరం ఖమ్మం జిల్లా వైరాలో మధ్యాహ్నం రెండుగంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలోనే వ్యవసాయరంగానికి సబంధించిన పంటల రుణాల మూడోవిడత మాఫీ ప్రక్రయిను చేపట్టనున్నారు. పంటల పెట్టుబడిగా బ్యాంకుల ద్వారా రూ.2లక్షల వరకూ రుణాలు పొందిన రైతులకు రుణాలు మాఫీ చేయనున్నారు. ఇందులో భాగంగా రూ.6వేలకోట్లు విడుదల చేసి వాటిని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేసే ప్రక్రియకు శ్రీకారం చెట్టనున్నారు. దీంతో దేశ వ్యవసాయరంగం చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రాన్ని రుణమాఫీలో మైలురాయిగా నిలపనున్నారు.

సీతారామతో 6.74లక్షల ఎకరాలకు సాగునీరు:
సీతారామ ఎత్తిపోతల పథకం ప్రారంభం ద్వారా 6.74లక్షల ఎకరాలకు సాగునీరందనుంది. ఇందులో కొత్తగా 3,28,853ఎకారాలతోపాటు 3,45,534ఎకరాలు స్థీరీకరణ జరగనుంది. ఈ పథకం ద్వారా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు సశ్యశ్యామలం కానున్నాయి. కృష్ణానదీపరివాహక ప్రాంత పరిధిలో ఉన్న నాగార్జునసాగర్ ఎడమ కాలువ గ్యాప్ ఆయకట్టుకు నమ్మకంగా గోదావరి నదీజలాలు అందబోతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీతారామ పథకం ప్రారంభ సూచికగా గురువారం నాడు మూడు మోటార్లను ఆన్‌చేసి గోదావరి నీటిని కాల్వలకు లిఫ్ట్ చేయనున్నారు. దీంతో ఈ ప్రాజెక్టు తొలిదశగా రైతులకు పాక్షిక ప్రయోజనాలు అందించనుంది. ఈ పధకం కింద మిగిలిపోయిన అన్ని పనలు పూర్తి చేసి 2026ఆగష్ట్ నాటికి పూర్తి స్థాయిలో ఆయకట్టుకు సాగునీటిని అందించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News