Thursday, January 23, 2025

రెమ్యునరేషన్ పెంచేసిన సీతారామం బ్యూటీ

- Advertisement -
- Advertisement -

 

మహారాష్ట్రకు చెందిన మృణాల్ ఠాకూర్ సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించారు. బుల్లితెర ద్వారా వచ్చిన ఫేమ్ తో హీరోయిన్ అయ్యారు. మరాఠీ చిత్రం విట్టి దండు తో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. మృణాల్ కి హిందీ మూవీ లవ్ సోనియా బ్రేక్ ఇచ్చింది వరుసగా సూపర్ 30, బాట్లా హౌస్ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు. ఆ తర్వాత వరుసగా బాలీవుడ్‌ సినిమాలు చేస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక గతేడాది ‘సీతారామం’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఈ మరాఠి బ్యూటీ. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది. తన నటన, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి.

కానీ మృణాళ్‌ మాత్రం గ్లామర్‌ పాత్రలు కాకుండా నటన ప్రాధాన్యమున్న పాత్రలు ఎంచుకుంటుందట. తాజాగా ఈ బ్యూటీ నాని తదుపరి సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ సినిమాలో నానికి భార్యగా మృణాళ్‌ కనిపించనుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు రెమ్యునరేషన్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. సీతారామంకు రూ.80లక్షలు తీసుకున్న ఈ బ్యూటీ నాని సినిమాకు కోటీ రూపాయిలు డిమాండ్‌ చేసిందట. దానికి నిర్మాతలకు కూడా ఒకే చెప్పారట. ప్రస్తుతం ఈ బ్యూటీ నాలుగు సినిమాలలో నటిస్తుంది. అందులో రెండు షూటింగ్‌ పూర్తి చేసుకోగా.. మరో రెండు షూటింగ్‌ దశలో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News