Thursday, April 3, 2025

అప్పుడు సచిన్ ఓపెనింగ్ చేయలేదు… ఇప్పుడు విరాట్ కూడా వద్దు: సెహ్వాగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జూన్ ఒకటి నుంచి టి20 వరల్డ్ కప్ నేపథ్యంలో జట్టులో ఎవరికి తీసుకోవాలి, ఎవరిపై వేటు వేయాలి అని మాజీ క్రికెటర్లు జట్టులోని ఆటగాళ్ల పేర్లను తెలియజేస్తున్నారు. విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ జట్టు ప్రయోజనాల కోసం ఏ స్థానంలోనైనా ఆడటానికి సిద్ధంగా ఉండాలని తెలిపాడు. అసలు సచిన్‌కు మిడిల్ ఆర్డర్‌లో ఆడటం ఇష్టం ఉండదు కానీ 2007 వరల్డ్ కప్‌లో జట్టు ప్రయోజనాల కోసం మిడిల్ ఆర్డర్ ఆడాడని తెలియజేశాడు. తనకు అవకాశ కల్పిస్తే విరాట్‌ను ఓపెనింగ్‌కు పంపించను అని, మూడో స్థానంలో ఆడిస్తానని, రోహిత్‌కు ఓపెనింగ్‌కు తోడుగా యశస్వి జైస్వాల్ ఉంటాడని పేర్కొన్నారు. వన్ డౌన్‌లో విరాట్ ఉంటాడని చెప్పుకొచ్చారు. పవర్ ప్లేలో వికెట్ పడితే విరాట్ బ్యాటింగ్‌కు దిగి ఇన్నింగ్స్ చక్కదిద్దే సామర్థ్యం ఉందని, వికెట్ కోల్పోకపోతే అతడు జట్టు అవసరాలకు అనుగుణంగా ఆడాలని స్వెహ్వాగ్ చెప్పారు.
రోహిత్ శర్మకు ఓపెనింగ్‌కు జైస్వాల్ తీసుకుంటే గిల్ పై వేటుపడుతుంది. టి20 వరల్డ్ కప్‌లో భాగంగా జూన్ 5న ఐర్లాండ్‌తో టీమిండియా ఆడనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News