- Advertisement -
ఐపిఎల్ 18వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘోరంగా విఫలమవుతోంది. గత సీజన్‌లో రన్నర్‌ఆప్ నిచిలిన సన్‌రైజర్స్ జట్టు ఈ సీజన్‌లో ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింటిలో ఓటమి పాలై. ఇక గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే హైదరాబాద్ చిత్తుగా ఓడిపోయింది. దీంతో జట్టుపై విమర్శలన వర్షం కురుస్తోంది.
తాజాగా టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ సన్‌రైజర్స్‌పై విమర్శలు గుప్పించారు. ‘ముందు నుంచి మంచిగా ఆడి.. ఆఖర్లో చేత్తులెత్తేస్తారనే పేరు ఒకప్పుడు పంజాబ్ కింగ్స్‌కి ఉండేది. ఇప్పుడు సన్‌రైజర్స్ అలాంటి పరిస్థితిలో కనిపిస్తున్నారు. సన్‌రైజర్స్ పూర్తిగా నిరాశ పరిచారు. జట్టులో ఎంతో మంది బ్యాటర్లు ఉన్నా.. ఒక్కరు పరుగులు చేయలేకపోయారు. 120కి ఆలౌటై డబ్బులు పెట్టి చూడటానికి వచ్చిన జనాన్ని నిరాశకి గురి చేశారు’ అని సెహ్వాగ్ పేర్కొన్నారు.
- Advertisement -