న్యూఢిల్లీ : కరోనా బాధితులకు తన వంతు సహాయం అందించేందుకు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ముందుకు వచ్చాడు. కరోనా మహమ్మరి విజృంణతో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కఠినమైన లాక్‌డౌన్‌లను అమలు చేస్తుండంతో లక్షలాది మంది ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కరోనా దెబ్బకు చాలా మంది ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఉపాథి లేక ఢిల్లీ వంటి మహా నగరంలో లక్షలాది మది ఆకలితో అలమటిస్తున్నారు. ఇలాంటి సమయంలో కష్టాల్లో ఉన్న వారికి ఉచితంగా ఆహారాన్ని అందించేందుకు వీరేంద్ర సెహ్వాగ్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. తన ఫౌండేషన్ ద్వారా ఆకలితో ఉన్న వారికి ఉచితంగా ఆహారాన్ని అందిస్తానని వీరూ ఫౌండేషన్ ట్విటర్ వేదికగా ప్రకటించింది. ఇప్పటి వరకు ఈఫౌండేషన్ దాదాపు 51 వేల మందికి ఉచితంగా ఆహార పదార్థాలను అందించింది. ఎవరైనా ఆకలితో అలమటించినట్లయితే తమను సంప్రదించాలని ఫౌండేషన్ కోరింది.
కొవిడ్ బాధితులకు సెహ్వాగ్ ఫౌండేషన్ అండ
- Advertisement -
- Advertisement -
- Advertisement -