Wednesday, April 2, 2025

పాకిస్థాన్‌తో రెండో వన్డే.. కివీస్‌కు ఊహించని షాక్

- Advertisement -
- Advertisement -

న్యూజిలాండ్ పర్యటనలో పాకిస్థాన్ ఉహించినంత గొప్పగా ఆటతీను కనబర్చలేదు. తొలుత జరిగిన టి-20 సిరీస్‌లో 4-1య తేడాతో ఓటమిపాలైన పాక్ వన్డే సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లోనూ చిత్తుగా ఓడిపోయింది. కాగా హామిల్టన్ వేదికగా జరిగే రెండో వన్డేలో పాక్‌ని ఓడించి సిరీస్‌ని 2-0 తేడాతో దక్కించుకోవాలని కివీస్ భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కి ముందు న్యూజిలాండ్‌కి ఊహించని షాక్ తగిలింది. జట్టులో కీలక ఆటగాడు మార్క్ చాప్‌మాన్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కి దూరమయ్యాడు.

మొదటి వన్డేలో చాప్‌మాన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 111 బంతుల్లో 132 పరుగులు చేసి తన కెరీర్‌లో బెస్ట్ వ్యక్తిగత స్కోర్‌ని సాధించాడు. ఈ మ్యాచ్‌లోనే అతను గాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో అతని తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఆట మధ్యలోనే మైదానం వదిలి వెళ్లిపోయాడు. అయితే ఈ గాయం నుంచి కోలుకోవడానికి రెండు వారాల సమయం పడుతుందని వైద్యులు చెప్పారు. దీంతో రెండో మ్యాచ్‌లో చాప్‌మాన్ స్థానంలో టిమ్ సీఫెర్ట్ జట్టులోకి వచ్చాడు. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత సీఫెర్ట్ జట్టులోకి వచ్చాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News