Monday, December 23, 2024

ముంబై అహ్మదాబాద్ హెచ్‌ఎస్‌ఆర్ కారిడార్‌లో 28 సీస్మోమీటర్లు

- Advertisement -
- Advertisement -

ముంబై : ముందస్తు భూకంప హెచ్చరికల కోసం ముంబై అహ్మదాబాద్ ‘బుల్లెట్ ట్రయిన్ ’ కారిడార్‌లో 28 సీస్మోమీటర్లను ఏర్పాటు చేయనున్నట్టు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సిఎల్ ) సోమవారం వెల్లడించింది. ప్రయాణికులకు భద్రత కల్పించడమే కాకుండా కీలకమైన సౌకర్యాల భద్రత కోసం జపనీస్ షింకన్‌సేన్ టెక్నాలజీ ఆధారంగా ఈ వ్యవస్థ పనిచేస్తుందని వివరించింది. ఈ 28 సీస్మోమీటర్లలో 22 కారిడార్ పొడవునా ఏర్పాటవుతాయని పేర్కొంది. వీటిలో ఎనిమిది మహారాష్ట్ర లోని ముంబై, థానే, విరార్, బొయిసార్‌లో ఏర్పాటు కాగా, మిగతా 14 గుజరాత్ లోని వాపి, బిలిమొర, సూరత్, భారూచ్, వడోదర, ఆనంద్, మహెమ్‌బాదాద్, అహ్మదాబాద్‌లో ఏర్పాటవుతాయి. మిగతా ఆరు సీస్మోమీటర్లను ఇన్‌లాండ్ సీస్మోమీటర్లుగా వ్యవహరిస్తారు.

ఎక్కడైతే తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయో అక్కడ అంటే మహారాష్ట్ర లోని ఖేడ్, రత్నగిరి, లాతూర్, పాంగ్రి, గుజరాత్ లోని ఆడేశార్, ఓల్డ్ భుజ్, ప్రాంతాల్లో నెలకొల్పుతారు. కారిడార్ పొడవునా ట్రాక్షన్ సబ్ స్టేషన్లు, స్విచ్చింగ్ పోస్ట్‌ల్లో ఈ సీస్మోమీటర్లు ఏర్పాటవుతాయి. భూకంప ప్రకంపనలు ప్రారంభదశ లోనే ఈ సీస్కో మీటర్లు కనుగొన గలుగుతాయి. అప్పటికప్పుడే విద్యుత్ సరఫరాను అపగలుగుతాయి. ఎప్పుడైతే విద్యుత్ సరఫరా ఆగిపోతుందో ఎమర్జెన్సీ బ్రేకులు క్రియాశీలం అవుతాయి. ఆయా ప్రాంతాల్లో తిరిగే రైళ్లు ఆపివేయబడతాయి. కారిడార్ వెంబడి ఎక్కడైతే భూకంపాలు గత వందేళ్లలో 5.5 కన్నా తీవ్ర స్థాయిలో సంభవించాయో ఆయా ప్రాంతాలను జపాన్ నిపుణులు సర్వే చేశారు. సూక్ష్మస్థాయి ప్రకంపనల పరీక్షద్వారా , అనువైన నేల ఉన్న ప్రాంతాలను సీస్మోమీటర్ల ఏర్పాటుకు అధ్యయనం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News