Monday, December 23, 2024

ఉత్తరాఖండ్ నుంచి డ్రగ్స్ రవాణా రాకెట్

- Advertisement -
- Advertisement -

ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ జిల్లా హల్‌ద్వానీకి చెందిన వ్యక్తి నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 268 బిట్‌కాయిన్లను స్వాధీనం చేసుకుంది. వీటివిలువ రూ.130 కోట్లు. అంతర్జాతీయ డ్రగ్ రవాణా గ్రూప్‌తో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసు కింద ఈడీ ఈ దాడులు సాగించింది. ఈమేరకు నిందితుడు పర్వీందర్ సింగ్‌ను ఏప్రిల్ 27న అదుపు లోకి తీసుకున్నారు. డార్క్ వెబ్ ద్వారా అక్రమంగా డ్రగ్స్ అమ్మకం సాగించగా వచ్చినదంతా అప్పగిస్తానని నిందితుడు అంగీకరించాడని ఈడీ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ వ్యవహారంలో చాలా వరకు అమ్మకాలు ఐరోపా దేశాల్లోనే సాగాయి. అమెరికా అధికార యంత్రాంగం నుంచి పరస్పర చట్టపరమైన అభ్యర్థన ద్వారా దర్యాప్తు చేపట్టినట్టు ఈడీ తెలియజేసింది. పర్వీందర్ సింగ్ , అతని సోదరుడు బన్మీత్ సింగ్, మరికొంతమంది అంతర్జాతీయ డ్రగ్ రవాణా గ్రూప్‌ను సింగ్ డిటివొ అనే పేరున ప్రారంభించారు. డార్క్ వెబ్ లోని వెండర్ మార్కెటింగ్ సై ట్స్‌ను ఉపయోగించి ప్రకటనలు ముమ్మరంగా ఇస్తూ ఈ రవాణా బాగోతాన్ని నడిపేవారని తేలింది. అమెరికా, బ్రిటన్, ఇతర ఐరోపాదేశాలకు మాదక ద్రవ్యాలను విక్రయిస్తుండే వారు. ఈ వ్యవహారానికి సంబంధించి 130. 48 కోట్ల విలువతో సమానమైన క్రిప్టోకరెన్సీని పట్టుకున్నామని ఈడీ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News