Wednesday, January 22, 2025

నగరంలో కేజీ గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: కరీంనగర్ పట్టణంలోని రాంనగర్ ప్రాంతంలో గంజాయి అమ్ముతూ ఇద్దరు యువకులను ఎన్పోర్స్‌మెంట్ అండ్ అర్బన్ స్టేషన్ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్లపల్లికి చెందిన భూక్యా అర్జున్, కొడిమ్యల మండలం సూరంపేటకు చెందిన భూక్యా కళ్యాణ్ అనే ఇద్దరు వ్యక్తులు కొంత మంది యువకులకు గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డారని, వీరి వద్ద నుండి కిలో గంజాయి పట్టుకున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్ ఎ విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

వీరు కొద్దిరజులుగా ఆంధ్రప్రదేశ్‌లోని సీలేరు ప్రాంతం నుండి బస్సులో వెళ్లి కొంత మొత్తంలో గంజాయి కొనుక్కొని వస్తూ నగరంలో యువకులకు 500 రూపాయలకు 50 గ్రాముల చొప్పున అమ్ముతున్నారని, విద్యార్థులు, యువకులు ఇలాంటి చెడు వ్యసనాలకు లోనుకాకుండా ఉండాలని అనవసరంగా కేసులలో ఇరుక్కొని తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హెచ్చరిస్తూ పిల్లల తల్లిదండ్రులు కూడా వీరి రోజు వారీ కార్యకలాపాలను గమనించాలని సూచించారు.

కేసు చేదించిన ఎన్పోర్స్‌మెంట్ అండ్ అర్బన్‌స్టేషన్ అధికారులను, సిబ్బందిని అభినందించారు. ఈకార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ పి శ్రీనివాసరావు, ఎన్పోర్స్‌మెంట్ సీఐ విజయ్‌కుమార్, అర్బన్ సీఐ తాతాజీ, ఎస్‌ఐ చిరంజీవి, హెడ్‌కానిస్టేబుల్ కొండాల్‌రావు, శివ, శ్రీనివాస్, వెంకటేశ్, శ్రీకాంత్, రాము, మహేష్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News