Sunday, December 22, 2024

ఎపిలో 10.77కిలోల బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

Seizure of 10.77 kg gold in AP

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ కస్టమ్స్ కమిషనరేట్ పరిధిలో గోల్డ్ స్మగ్లింగ్ రాకెట్ నుంచి 10.77కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మూడు కార్లలో అక్రమంగా తరలిస్తున్న రూ.5.80 కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. చెన్నై నుంచి గుంటూరు, రాజమండ్రికి భారీగా బంగారం, వెండి తరలిస్తున్నట్టు ఈనెల 24న కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో ఆయా మార్గాలోని అన్ని టోల్‌ప్లాజాల వద్ద కస్టమ్స్ అధికారులు నిఘా ఏర్పాటు చేయగా బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద అనుమానాస్పదంగా కనిపించిన మూడు కార్లను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేసి కార్లలోని సీట్ల కింది భాగంలో ప్రత్యేక అరలను దాచిన బంగారం స్వాధీనం చేసుకున్నారు.

ఈక్రమంలో మూడు కార్లలో కలిపి రూ.5.80 కోట్ల విలువ గల బంగారం సీజ్ చేశారు. అలాగే కాకినాడ డివిజన్ కస్టమ్స్ అధికారులు జరిపిన తనిఖీల్లోనూ రాజమహేంద్రవరం వద్ద ఒక్కొక్కటి కిలో బరువు ఉన్న 24 వెండి దిమ్మెలను స్వాధీనం చేసుకున్నారు. వీటిపై విదేశీ గుర్తింపు ముద్రలున్నట్టు అధికారులు వెల్లడించారు. బంగారం, వెండి స్మగ్లింగ్‌కు సంబంధించి ఐదుగురు నిందితులను అదుపులోనికి తీసుకుని ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా నిందితులకు రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. 2014లో విజయవాడ కస్టమ్స్ కమిషనరేట్ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటివరకూ ఛేదించిన స్మగ్లింగ్ కేసుల్లో ఇదే అతిపెద్దదని కస్టమ్స్ అధికారులు పేర్కొంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News