Monday, November 18, 2024

16 కేజీల గంజాయి పట్టివేత..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / భద్రాచలం: భద్రాద్రికొత్తగూడెం జిల్లా, భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్‌లో ఆదివారం నిర్వహించిన తనిఖీల్లో 16 కేజీల గంజాయిని పట్టుకుని, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు భద్రాచలం ఏఎస్పీ పారితోష్ పంకజ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం భద్రాచలం పట్టణ ఎస్‌ఐ మధుప్రసాద్ ఆదివారం సాయంత్రం తన సిబ్బందితో స్థానిక బస్టాండ్‌లో సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా తమిళనాడు రాష్ట్రం, చైన్నైకి చెందిన జీవన్‌నందన్, మణికందన్, శంకర్‌లు అనుమానంగా కనిపించారు. వారిలో శంకర్ అనే యువకుడు పోలీసులను చూడగానే పారిపోయాడు.

దీంతో పోలీసులు మిగిలిన వారి బ్యాగులు తనిఖీ చేయగా మూడు బ్యాగులలో మొత్తం 16 కేజీలు గంజాయి లభ్యమయింది. పోలీసులు జీవన్‌నందన్, మణికందన్‌లను అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. ఈ గంజాయిని ఒడిస్సా సరిహద్దుల్లో గల సీలేరులో కొనుగోలు చేసి చెన్నైలో విక్రయించడానికి అక్రమంగా తరిలిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ. 3లక్షల 20 వేలు ఉంటుందని, భద్రాచలం సిఐ నాగరాజురెడ్డి కేసు నమోదు చేసి నిందితులను రిమాండుకు తరలించినట్లు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News